అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖలో రాజధాని ఎవరు అడిగారు: సంపద సృష్టి లేదు..చిచ్చు పెడుతున్నారు: యనమల ఫైర్..!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ కు వ్యక్తిగత ఆదాయం పెంచుకోవటం మినహా..రాష్ట్ర సంపద పైన శ్రద్ద లేదని మాజీ మంత్రి యనమల ఆరోపించారు. అమరావతి నుండి రాజధాని తరలిస్తే రైతులకే కాదని..రాష్ట్రానికి నష్టం చేస్తుందన్నారు. ఆర్దిక రేటు నాలుగు శాతం పడిపోయిందని...సందప సృష్టి లేకుంటే..సంక్షేమ పధకాలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.

అసలు విశాఖలో రాజధాని కావాలని ఎవరు అడిగారని.. విశాఖ ఇప్ప టికే డెవలప్ అయిన నగరంగా పేర్కొన్నారు. అక్కడ భూ కబ్జాల కోసమే విశాఖకు వెళ్తున్నారని ఆరోపించారు. జగన్ పక్క రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు జరిగేలా ఇక్కడ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో వైయస్సార్ నవశకం పేరుతో జగన్ పధకాలను లబ్దిదారులకు దూరం చేసి నయవంచన చేస్తున్నారని యనమల మండిపడ్డారు.

పక్క రాష్ట్రాలకు ఆదాయం వచ్చేలా..

ముఖ్యమంత్రి జగన్ ప్రత్యక్షంగా..పరోక్షంగా పక్క రాష్ట్రాలకు ఆదాయం వచ్చేలా వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల ఆరోపించారు. ఏపీలో ఆర్దిక రేటు నాలుగు శాతం పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. కర్నాటక..తమిళనాడుల్లో ప్రభుత్వాలు మారినా విధానాలు కొనసాగిచటంల వలన ఆర్దికంగా నిలదొక్కుకున్నారని వివరించారు.

జగన్ మాత్రం తనతో పాటుగా తన అనుచరులు డెవలప్ అయ్యే విధంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ఏపీలో ఏడు నెలల కాలంలో ఒక్క డెవలప్ మెంట్ నిర్ణయం కూడా జరగలేదని..పనులు ఎక్కడికక్కడ నిలిపివేసారని ఆందోళన వ్యక్తం చేసారు.సంపద ను సృష్టించకపోతే ఆదాయం ఎక్కడి నుండి వస్తుందని..పధకాలు ఎలా అమలు చేస్తారని యనయల ప్రశ్నించారు. ఏపీలో పరిశ్రమలు లేవని..పెట్టుబడులు రావటం లేదని..ఇక ఉపాధి ఎక్కడి నుండి కల్పిస్తారని నిలదీసారు. ఇంత మంది సలహాదారులు ఉండి సీఎంకు ఏం సలహాలు ఇస్తారని యనమల ప్రశ్నించారు.

విశాఖలో రాజధాని ఎవరు అడిగారు..

అమరావతి కేవలం రైతులదే కాదని..ఏపికి ఆదాయం తెచ్చే నగరమని యనమల వివరించారు. అమరావతి నుండి పాలన చేయటానికి వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. ఒకే దశలో రాజధాని నిర్మాణం చేయాల్సిన అవసరం లేదన్నారు. విశాఖలో ఎవరు అడిగారని రాజధాని పెడుతున్నారని..అక్కడ ఇప్పటికే డెవలప్ అయిన నగరమని వివరించారు.

yanamala slams CM jagan on capital shifting proposals

హైకోర్టు కర్నూలులో డిమాండ్ ఉందని..అక్కడకు తరలించ టం అవసరమే అని..అయితే, సాద్యాసాధ్యాలు చూడాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖలో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని..అక్కడ భూ కబ్జాలకోసమే విశాఖను ఎంచుకున్నారని ఆరోపించారు. ఉత్త రాంధ్ర మీద అభిమానం ఉంటే పోలవరం ఎడమ కాల్వ పనులు ఎందుకు నిలిపివేసారని ప్రశ్నించారు. విశాఖలో విజయమ్మ గెలిస్తే దందాలకు దిగుతారని భావించి..అప్పుడు గెలిపించలేదని..ఇప్పుడు రాజధాని పేరుతో ఏం చేస్తారో అనే భయం అక్కడి వారిలో కనిపిస్తోందని యనమల వ్యాఖ్యానించారు.

English summary
TDP senior leader yanamala slams CM jagan on capital shifting proposals. He says only for capturing of Vizag lands govt thinking about capital shifting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X