శభాష్ అనిపించుకున్న ఎమ్మెల్యే యరపతినేని: ఏం చేశారో తెలుసా?

Subscribe to Oneindia Telugu
Gurajala MLA Yarapathineni Srinivasa Rao Did A Good Job శభాష్ అనిపించుకున్న ఎమ్మెల్యే...| Oneindia

గుంటూరు: తెలుగుదేశం పార్టీ ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమాన్ని ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా ముందుకు తీసుకెళుతున్నారు. ఈ క్రమంలో పిడుగురాళ్ల మండలం కోనంకిలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నిర్వహించిన పర్యటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఎమ్మెల్యే పలకరింపు..

ఎమ్మెల్యే పలకరింపు..

ఎమ్మెల్యే యరపతినేని కాలినడకన పర్యటిస్తున్న సమయంలో పురం పిచ్చమ్మ అనే 70ఏళ్ల వృద్ధురాలు ఓ బుట్టలో సమోసాలు, బన్‌(రొట్టె)లు పెట్టుకుని అమ్ముకుంటూ కనిపించింది. దీంతో ఆమెను పలకరించారు యరపతినేని.

అవ్వా నీ దగ్గర ఏమున్నాయ్?

అవ్వా నీ దగ్గర ఏమున్నాయ్?

‘అవ్వా నీ దగ్గర ఏమున్నాయ్?' అంటూ ఆమెను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అడిగారు. దీనికామే స్పందిస్తూ.. ‘సమోసాలు.. నాన్ రొట్టెలు ఉన్నాయి' అని చెప్పింది. వీటినే అమ్ముకుని జీవనం సాగిస్తున్నట్లు తెలిపింది.

మొత్తం కొనేశారు..

మొత్తం కొనేశారు..

ఇంత ఎండలో నువ్వెక్కడ అమ్ముతావులే ఇవన్నీ అంటూ.. మొత్తం సమోసాలు, రొట్టెలు తీసుకుని ఆమెకు రూ. 2వేలు ఇచ్చారు. ఆ తర్వాత కొనేసిన సమోసాలు, రొట్టెలను చుట్టూ ఉన్న పార్టీ నేతలకు, కార్యకర్తలకూ పంచారు.

ఎమ్మెల్యేకు అభినందనలు..

ఎమ్మెల్యేకు అభినందనలు..

కాగా, తన సరుకు మొత్తం అమ్మినా తనకు రూ.300లే వస్తాయని.. కానీ ఎమ్మెల్యే తనకు రూ. 2వేలు ఇచ్చారంటూ పిచ్చమ్మ సంతోషం వ్యక్తం చేసింది. మంచి పని చేశారంటూ సదరు ఎమ్మెల్యేను అక్కడున్న వారు అభినందించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Gurajala MLA Yarapathineni Srinivasa Rao helped a old woman in his visit in Piduguralla mandal in Guntur district.
Please Wait while comments are loading...