'రెండు, మూడు నెలల్లో జగన్ సెంట్రల్ జైలుకు వెళ్తాడు..'
లక్షలాది కోట్లు పెట్టుబడులుగా ఏపీకి వస్తుంటే.. జగన్ ఓర్వలేని తనంతో వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్ పై గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ కు పదవీ వ్యామోహం ఉందని చెబుతూ.. ఎంతసేపు ఆయన అదే ఆలోచనలో ఉంటారని విమర్శించారు.
ఎప్పుడెప్పుడూ సీఎం అవుదామన్న ఆలోచనే తప్ప..రాష్ట్రాభివృద్ధి గురించి జగన్ కు పట్టదని విమర్శించారు. విమర్శలకు మరింత పదునుపెడుతూ.. రానున్న రెండు, మూడు నెలల్లో సెంట్రల్ జైలుకు వెళ్లడం మాత్రం ఖాయమని యరపతినేని వ్యాఖ్యానించడం గమనార్హం.

విశాఖలో తన తల్లి విజయమ్మ ఓడిపోవడాన్ని జగన్ ఇప్పటికీ ఓర్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు. లక్షలాది కోట్లు పెట్టుబడులుగా ఏపీకి వస్తుంటే.. జగన్ ఓర్వలేని తనంతో వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. అందుకే విశాఖలో హోదా పేరిట జనాలను భయభ్రాంతులకు గురిచేసేందుకు జగన్ కుట్ర పన్నారని యరపతినేని ఆరోపించారు.












Click it and Unblock the Notifications