ఆ క్రెడిబులిటీ లేని రోజు మా నాయనా లేడు, నేను లేను
Yatra 2: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంపై తెరకెక్కిన మూవీ.. యాత్ర 2 (Yatra 2). మహీ వీ రాఘవ్ దర్శకుడు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. వీ సెల్యులాయిడ్, త్రీ ఆటమ్ లీవ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోన్నాయి. శివ మేకా నిర్మాత.
2019లో విడుదలైన యాత్రకు ఇది సీక్వెల్. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర మూవీ అప్పట్లో రాజకీయంగా సంచలనం రేపింది. ఆ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర విడుదలైన ఈ సినిమా అప్పట్లో పొలిటికల్ సెన్సేషన్‌గా మారింది.

ఇప్పుడా సినిమాకు సీక్వెల్‌గా యాత్ర 2 తెరకెక్కింది. వైఎస్ జగన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు జీవా నటించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్‌ను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి పోషించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని గ్లింప్సెస్ విడుదలయ్యాయి. టైటిల్ అనౌన్స్‌మెంట్, మోషన్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి.
వైఎస్ భారతి, సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు.. ఇలా సమకాలీన రాజకీయాల్లో ఉన్న నేతలందరి క్యారెక్టర్లూ ఈ సినిమాలో ఉన్నాయి. వైఎస్ భారతిగా మలయాళ నటి కేతకి నారాయణ్, సోనియా గాంధీగా సుజన్నె బెర్నాట్, చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్ నటించారిందులో.
తాజాగా- ఈ సినిమా ఈ ట్రైలర్ విడుదలైంది. దర్శకుడు మహీ వీ రాఘవ్ ఈ ఉదయం దీన్ని రిలీజ్ చేశారు. సోనియా గాంధీ, చంద్రబాబు, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల, కే రోశయ్య సహా అన్ని ప్రధాన క్యారెక్టర్లు ఇందులో కనిపించాయి. విడుదలైన కొన్ని గంటల్లోనే భారీగా వ్యూస్‌ను సొంతం చేసుకుందీ మూవీ.












Click it and Unblock the Notifications