వైసీపి100..! స్పష్టమైన ఆదిక్యం దిశగా జగన్..!!
Recommended Video
అమరావతి: తొలి రౌండ్ నుంచి ప్రతి రౌడ్ లో వైసీపీ ఆధిక్యం కనబరిచింది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తయిన నియోజకవర్గాల్లో ఈవీఎంలను తెరచిన అధికారులు తొలి రౌండ్ కౌంటింగ్ ను పూర్తి చేయగా, టీడీపీ పార్టీతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో సాగుతోంది. వైసీపీ నుంచి మైదుకూరులో ఎస్ రఘురామిరెడ్డి, నెల్లూరు టౌన్ లో పోలుబోయిన అనిల్ కుమార్, కడపలో షేక్ అంజాద్ బాషా, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో గొర్లె కిరణ్ కుమార్, మచిలీపట్నంలో పేర్ని నాని (వెంకట్రామయ్య), అరకులో చెట్టి ఫాల్గుణ ముందంజలో ఉన్నారు.

ఆదిక్యం లొ వైసీపి..! దూసుకెళ్తున్న జగన్..!!
వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు, నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టెక్కలి నుంచి పేరాడ తిలక్, జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబు ఆధిక్యంలో ఉన్నారు. ఇదే సమయంలో టీడీపీ తరఫున పెద్దాపురం నుంచి బరిలోకి దిగిన నిమ్మకాయల చినరాజప్ప, మంగళగిరిలో నారా లోకేశ్, రాజమహేంద్రవరం నుంచి ఆదిరెడ్డి భవాని ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకూ 13 నియోజకవర్గాల్లో తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తి కాగా, వైసీపీ 10, టీడీపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

సంబరాల్లో వైసీపి శ్రేణులు..! టీడిపి మంత్రులు వెనుకంజ..!!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో వైపీసీ ఫలితాలు వెలువడుతున్నాయి. 70 స్థానాల్లో తొలి రౌండ్, మరో 20కిపైగా స్థానాల్లో రెండో రౌండ్ తో కలిపి 91స్థానాల్లో దూసుకెళుతోంది. 70కి పైగా స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రముఖులైన అభ్యర్థులంతా 1,200 నుంచి 2,500 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. ఇప్పటివరకూ 93 స్థానాల ట్రెండ్స్ వెలువడగా, తెలుగుదేశం 18, వైసీపీ 74 స్థానాల్లో, జనసేన 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. రాజోలులో జనసేన అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

బాబు తో దోబూచులాడుతున్న ఆదిక్యం..! రౌండ్ రౌండ్ కు మారుతున్న ట్రెండ్..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తాను పోటీ చేసిన చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో వెనుకంజలో కొనసాగుతున్నారు. ఇక్కడ రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి అనూహ్య ఫలితం కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన డాక్టర్ చంద్రమౌళి 357 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ప్రచారం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్, చంద్రబాబుపై చంద్రమౌళి గెలిస్తే మంత్రి పదవిని ఇస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే. కుప్పంలో ప్రస్తుత ట్రెండ్స్ టీడీపీకి ఏ మాత్రం అనుకూలంగా కనిపించక పోయినా, లెక్కించబోయే రౌండ్లలో ఆధిక్యం ఖాయమని, తమదే విజయమని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

శతకం ఆధిక్యంలో వైసీపీ...! జగన్ కాబోయే సీయం అంటున్న శ్రేణులు..!!
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ విజయం దిశగా కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అసెంబ్లీతో పాటు లోక్ సభ స్థానాల్లోనూ విజయం దిశగా సాగుతోంది. తొలి రెండు రౌండ్లలోనూ ఆధిక్యం కనబరిచింది. ప్రస్తుతం అసెంబ్లీ స్థానాల్లో 107వైసీపీ, 23టీడీపీ, రెండు స్థానాల్లో జనసేన పార్టీ ఆధిక్యంలో ఉన్నాయి. పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ 11, టీడీపీ 4స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications