శేఖర్ రెడ్డితో బాబుకు సంబంధాలు...నా వద్ద ఆధారాలు:వైసిపి నేత బొత్స సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ:ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసిపి నేత బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణ చేశారు. శేఖర్ రెడ్డితో సిఎం చంద్రబాబు నాయుడుకు ఉన్న సంబంధాలపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

పెద్ద నోట్ల రద్దు సందర్భంగా చంద్రబాబు తన ద్వారా 500 కోట్ల రూపాయల బ్లాక్ మనీని మార్చుకున్నారని శేఖర్ రెడ్డి సిబిఐకి వాంగ్మూలం ఇచ్చినట్లు బొత్స సత్యనారాయణ ఓ టివి చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ సిబిఐ నివేదిక బయట పడితే చంద్రబాబుతో శేఖర్ రెడ్డి కి ఉన్న లింకేంటనేది బయటపడిపోతుందని బొత్స చెప్పారు.

YCP Botsa Satyanarayana sensational allegations on CM Chandrababu

శేఖర్ రెడ్డితో ముఖ్యమంత్రి చంద్రబాబు,లోకేష్ సంబంధాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణ చేసి, ఆ తరువాత సైలెంట్ అయిపోయారని...ఆ తరువాత తాను అదే విషయంపై ఆరా తీస్తే చాలా వాస్తవాలు బయటపడ్డాయని బొత్స సత్యనారాయణ వివరించారు. ముఖ్యమంత్రి
చంద్రబాబుతో శేఖర్ రెడ్డికి ఉన్న చీకటి సంబంధం వ్యవహారాన్నిజనంలోకి తీసుకెళ్తామని బొత్స ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vijayawada: YCP Senior Congress leader Botsa Satyanarayana has made sensational allegations against TDP chief and AP CM Chandrababu Naidu. Botsa Satyanarayana revealed that he has evidence on the links of CM Chandrababu Naidu with Shekhar Reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి