రోజాలో ఏంటీ సడన్ ఛేంజ్ - అడుగులు ఎటు..!!

మాజీ మంత్రి రోజా. వైసీపీ ఫైర్ బ్రాండ్. టీడీపీ అధినేత చంద్రబాబు పైన విరుచుకుపడే వారు. జగన్ పైన ప్రతీ సందర్భంలోనూ తన అభిమానం చాటుకొనే వారు. మంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ లక్ష్యంగా రోజా తరచూ విమర్శలు చేసేవారు. తాజా ఎన్నికల్లో రోజా ఓడిపోయారు. కొద్ది రోజులు మౌనంగా ఉన్న రోజా తిరిగి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ, రోజాలో అనూహ్య మార్పు కనిపిస్తోంది. గతం కంటే పూర్తి భిన్నంగా రోజా వ్యవహార శైలి ఉండటం ఇప్పుడు చర్చగా మారింది.

రోజా తీరులో మార్పు
మాజీ మంత్రి రోజా టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన సమయం నుంచి చంద్రబాబు ను లక్ష్యంగా చేసుకొని తరచూ విమర్శలు గుప్పించేవారు. జగన్ హాయంలో మంత్రివర్గ విస్తరణలో చివరి నిమిషంలో పదవి దక్కించుకున్నారు. తాజా ఎన్నికల్లో నగరి లో రోజా ఓడిపోయారు. పార్టీ అధికారం కోల్పోయింది. టూరిజం మంత్రిగా వ్యవహరించిన రోజా వివాదాస్పంగా మారిన రుషికొండ భవనాల గురంచి గతంలోనే స్పష్టత ఇచ్చారు. ఎన్నికల ఫలితాల తరువాత రుషికొండ అంశం మినహా ఇతర రాజకీయ అంశాలకు దూరంగా ఉంటున్నారు.

YCP Cadre Shocks with sudden Change in Roja key comments over political future

భవిష్యత్ పై నిర్దేశం
వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రోజా వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఆ ఫైర్ లేదు. మాటల తీరు మారింది. సొంత పార్టీ నేతలే రోజా మాట తీరులో వచ్చిన మార్పు పైన చర్చించుకుకోవటం ఆసక్తి కరంగా మారింది. రోజా మాట తీరు హుందాగా ఉందంటూ అభినందిస్తున్నారు. రోజా.. వైఎస్ఆర్ పాలనను మెచ్చుకున్నారు, అలాంటి పాలనే జగన్ అందించారని చెప్పారు, అదే పాలన మళ్లీ కావాలని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని చెప్పుకొచ్చారు.

కార్యకర్తల్లో చర్చ
గత ఎన్నికల్లో ఓడిపోయామని..ఓడిపోవటం బాధాకరమైనా..ఎప్పుడూ ప్రజల పక్షాన ఉండాలని సూచించారు. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా.. ఎల్లప్పుడూ వైసీపీ ప్రజాపక్షంలో ఉంటుందన్నారు. రాజన్న పాలన మళ్లీ రావాలని, రాజన్న బిడ్డ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, ప్రజల కష్టాలు దూరమయ్యేలా అందరం కలసికట్టుగా పనిచేయాలని సూచించారు రోజా. విమర్శనాస్త్రాల ప్రయోగాన్ని పక్కనపెట్టి.. వైసీపీ కార్యాచరణపైనే ఎక్కువగా మాట్లాడారు. సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా పని చేసిన వారి విషయంలోనూ రోజాలో మార్పు కనిపిస్తోంది. ఇదే విధంగా మంత్రిగా ఉన్న సమయంలోనూ వ్యవహరించి ఉంటే బాగుండదనే వ్యాఖ్యలు వైసీపీ కేడర్ లో మొదలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+