వైసిపి అభ్యర్దికి తప్పిన ప్రాణాపాయం : కొలంబో బాంబు పేలుళ్ల సమయంలో : సేఫ్‌గా జన్మభూమికి..!
తాజా ఎన్నికల్లో వైసిపి నుండి పోటీ చేసిన అభ్యర్ది తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. కొలంబోలో జరిగిన బాంబు పేలుళ్ల సమయంలో ఆయన కొలంబోలోనే ఉన్నారు. ఆయన తన సన్నిహితులతో కలిసి బస చేసిన హోటల్ వద్ద బాంబు పేలుడు జరిగింది. అయితే, అప్పుడు వైసిపి అభ్యర్ది తన సన్నిహితులతో కలిసి అక్కడ నుండి తృటిలో తప్పించుకున్నారు.
కొలంబోలో వైసిపి అభ్యర్ది..
వైసిపి అభ్యర్ది తృటిలో ప్రాణాపాయం నుండి బయట పడిన సంగతి ఇప్పుడే వైసిపిలోనే కాదు..ఏపి మొత్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈస్టర్ డే రోజున శ్రీలంక రాజధాని కొలంబోలో ముష్కరులు జరిపిన బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు దాదాపు 320 వరకు మరణించారు. అయితే, ఇందులో తొమ్మది మంది భారతీయులు మరణించినట్లుగా చెబుతున్నారు. ఇక, ఏపిలోని అనంతపురం జిల్లాకు చెందిన కొందరు శ్రీలంగా బాంబు పేలుళ్ల సమయంలో సురక్షితంగా బయట పడినట్లు భారత విదేశాంగా శాఖ అధికారులు స్పష్టం చేసారు. ఇదే సమయంలో ఏపికి చెందిన వైసిపి పార్టీ అభ్యర్దిగా తాజా ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్ది సైతం తృటిలో తప్పించుకున్నారు. ఆయన తన స్నేహితులతో కలిసి కొలంబోకు వెళ్లారు. అయితే, వారు బాంబు పేలుళ్ల నుండి తప్పించుకుని స్వదేశానికి చేరుకున్నారు.

క్షేమంగా జన్మభూమికి..
ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో ఏపిలోని విశాఖ జిల్లా అనకాపల్లి నుండి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీ చేసిన గుడివాడ అమర్‌నాద్ ఎన్నికల తరువాత స్నేహితులతో కలిసి శ్రీలంక వెళ్లారు. విహార యాత్రకు వెళ్లిన అమరనాధ్ తన మిత్రులతో కలిసి కింగ్స్ జ్యూరీ హోటల్‌లో బస చేసారు. వారు బస చేసిన హోటల్‌కు అతి సమీపంలో బాంబు పేలుళ్లు జరిగాయి. అప్రమత్తంగా వ్యవహరించిన అమర్‌నాద్, ఆయన స్నేహితులు తృటిలో తప్పించుకొని అక్కడ నుండి బయట పడ్డారు. వారు వెంటనే శ్రీలంకను వీడి భారత్ కు బయల్దేరారు. ఎట్టకేలకు క్షేమంగా విశాఖ చేరుకున్నారు. అమర్నాధ్‌తో పాటుగా స్థానిక వైసిపి నేతల శ్రీకాంత్ రాజు ఉన్నారు. విశాఖకు తిరిగొచ్చిన అమర్నాద్ దేవుడి ఆశీస్సులు...ప్రజల అభిమానమే తనను రక్షించాయని ఉద్వేగంతో చెప్పుకొచ్చారు. పలువురు పార్టీ నేతలు.. స్థానిక ప్రముఖులు అమర్నాధ్‌ను కలిసారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications