వైసీపీ కౌన్సిలర్ మహిళా వాలంటీర్ ను ఏం చేశాడంటే, క్లైమాక్స్ లో చెప్పుతో ??
వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధి తనను బెదిరించి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, తన బంగారం లాక్కోవడమే కాకుండా తనను చెప్పుతో కొట్టాడని ఓ బాధితరాలు సంచలన వ్యాఖ్యలు చేసింది. వైసీపీ కౌన్సిలర్ పైన ఆరోపణలు చేసిన మహిళ గత వైసీపీ ప్రభుత్వంలో మహిళా వాలంటీర్ గా కూడా పనిచేయడం, ఇప్పుడు వైసీపీ కౌన్సిలర్ పై ఆరోపణలు చెయ్యడం హాట్ టాపిక్ అయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో ఈ సంఘటనలు జరిగింది. చిత్తూరు జిల్లాలోని పలమనేరులో హైదర్ అనే వ్యక్తి వైసీపీ పార్టీ టిక్కెట్ పై పోటీ చేసి కౌన్సిలర్ గా ఎన్నిక అయ్యాడు. ఇదే పలమనేరు పట్టణంలో ముస్లిం వర్గానికి చెందిన ఓ మహిళ గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ గా పనిచేసింది. వాలంటీర్ గా పనిచేసిన మహిళకు చాలా ఏళ్ల క్రితమే పెళ్లి అయ్యింది.

బాధితురాలికి పిల్లలు కూడా ఉన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే మహిళా వాలంటీర్ గా పనిచేస్తున్న బాధితురాలి భర్త అనారోగ్యానికి గురైనాడు. ఆ సమయంలో భర్తకు మెరుగైన చికిత్స చేయించుకోవడానికి ఆ మహిళ తనకు సహాయం చేయాలని వైసీపీ కౌన్సిలర్ హైదర్ వద్దకు వెళ్ళింది. డబ్బులు అప్పు ఇవ్వడానికి హైదర్ అంగీకరించాడు. అయితే బంగారు నగలు తాకట్టు పెడితే డబ్బులు ఇస్తానని వైసీపీ కౌన్సిలర్ హైదర్ ఆ మహిళా వాలంటీర్ కి చెప్పాడు.
వేరే గత్యంతరం లేక ఆ మహిళా వాలంటీర్ కొంత బంగారు నగలను హైదర్ దగ్గర తాకట్టు పెట్టి ఆయన దగ్గర డబ్బు అప్పుగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ మహిళా వాలంటీర్ తో బలవంతంగా ఆమె ఉద్యోగానికి కూడా రాజీనామా చేయించారని ఆరోపణలు ఉన్నాయి. బంగారం ధరలు ఆకాశానికి పెరిగిపోవడంతో వైసీపీ కౌన్సిలర్ దగ్గర తాకట్టు పెట్టిన బంగారు నగలు విడిపించుకోవడానికి ఆ మహిళ నిర్ణయించింది.
మీకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని, తన బంగారు నగలు తనకు ఇవ్వాలని బాధితురాలు వైసీపీ కౌన్సిలర్ హైదర్ కు చెప్పింది. అయితే బంగారు నగలు తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన వైసీపీ కౌన్సిలర్ తనను అనేక సార్లు లైంగిక వేధింపులకు గురి చేశాడని, వాలంటీర్ గా పని చేసే సమయంలో కూడా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అంతేకాకుండా తనను చెప్పుతో కొట్టాడని, ఈ విషయం బయటకు చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా నీ బిడ్డలను చంపేస్తానని తనను బెదిరించాడని బాధితురాలు ఆరోపిస్తోంది.

ఇటీవల తాను తన బంగారు నగలు తిరిగి ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేశానని, ఆ సమయంలో వైసీపీ కౌన్సిలర్ హైదర్, అతని అనుచరలు తనపై దాడి చేశారని, స్థానికులను రక్షించి తనను ఆస్పత్రికి తరలించారని బాధితురాలు మీడియాకు చెప్పింది. పోలీసులు తనకు న్యాయం చేయాలని, తనను లైంగికంగా వేధించిన వైసీపీ కౌన్సిలర్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బాధితురాలు మీడియాకు మనవి చేసింది.
పలమనేరులో మాజీమంత్రి ఎన్. అమరనాథ్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గతంలో కూడా ఒక వైసీపీ కౌన్సిలర్ ఇదే పలమనేరు పట్టణంలో మున్సిపాలిటీలో ముగ్గురు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేశాడని బాధితులు పలమనేరు మునిసిపల్ కమిషనర్ కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మరో వైసీపీ కౌన్సిలర్ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడి ఆమెపై చెప్పులతో దాడులు చేశారని ఆరోపణలు రావడం పలమనేరులో హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications