ఏపీలో కూటమి హయంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాల లెక్కలివే..!
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండపోయిందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కూటమి పాలనలో మహిళలకు ,ముఖ్యంగా యువతలకు మన ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రలు క్షీణించాయని..ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణలేదని, ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రాతినిధ్యం వహిస్తోన్న చోటే మహిళలకు రక్షణ లేదని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులు తమ పిల్లలను స్కూల్‌కి పంపిస్తే క్షేమంగా ఇంటికి వస్తారా లేదా అన్న ఆందోళన చెందుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. . దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎంపీ గుమ్మడి తనూజా రాణి నేతృత్వంలోని వైసీపీ బృందం మంగళవారం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ మహిళా కమిషన్‌ను కలిసింది. ఏపీలో మహిళలు, అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న నేరాల సంఖ్య అంతకంతకు పెరుగుతోందని వైసీపీ నేతలు తెలిపారు.

తక్షణమే ఎన్ హెచ్ఆర్ సీ, జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై అత్యాచారాలు, హత్యలు వంటి ఘటనలు 77 జరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులతో మహిళలు అభద్రతాభావానికి గురవుతున్నారని వైసీపీ బృందం వివరించింది. వైసీపీ బృందంలో ఎంపీ తనూజా రాణితో పాటు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, వైసీపీ మహిళ విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి, మాజీ ఎంపీలు గొడ్డేటి మాధవి, చింతా అనురాధ ఉన్నారు.












Click it and Unblock the Notifications