సీఎం జగన్ నయా స్ట్రాటజీ - ముహూర్తం ఫిక్స్: ఎన్నికల వేళ..!!

ముఖ్యమంత్రి జగన్ పార్టీ నేతలకు రోడ్ మ్యాప్ సిద్దం చేసారు. ఇక నిత్యం ప్రజల్లోనే ఉండేలా కొత్త కార్యక్రమం ఖరారు చేసారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి పార్ీ నేతలకు మార్గనిర్దేశనం చేసారు. ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రతీ ఇంటికి వెళ్లేలా కొత్త కార్యక్రమం అప్పగించారు. జగనన్నే మా భవిష్యత్తు పేరుతో డోర్ టు డోర్ వెళ్లాలని స్పష్టం చేసారు. ఇందులో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం అయ్యేలా కార్యక్రమం రూపొందించారు. అదే సమయంలో ఎన్నికలకు సంబంధించి జగన్ క్లారిటీ ఇచ్చారు.

జగనన్నే మా భవిష్యత్తు..
ఏపీలో వైసీపీ ఎన్నికల ప్రచారం నినాదం ఖరారు చేసారు. జగనన్నే మా భవిష్యత్తు పేరుతో ప్రతీ ఇంటికి వెళ్లేలా కార్యక్రమం నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా వంద శాతం కుటుంబాలు కవర్ అయ్యేలా దీనిని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

ప్రతీ నియోజకవర్గం, మండలం, వార్డు, డోర్ టు డోర్ వెళ్లేలా ఒకే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచారం నిర్వహించనున్నారు. ప్రతీ ఒక్కిరిలో జగనతోనే భవిష్యత్ అనే నమ్మకం కలిగించటమే ఈ ప్రచార ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో సచివాలయం కన్వీనర్లు.. గృహ సారథులు కూడా ఇందులో పాల్గొంటారు. దాదాపు ఏడు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచారంలో పాల్గొనేలా నిర్ణయించారు.

YCP is going to launch one of its largest electoral campaigns called ‘Jagananne Maa Bhavishyatthu on April 7th

1.65 కోట్ల కుటుంబాలకు చేరువయ్యేలా..
రాష్ట్రంలోని 1.65 కోట్ల కుటుంబాలకు ఈ కార్యక్రమం ద్వారా దగ్గరయ్యేలా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రచారం సమయంలో నాలుగు రకాల ప్రచార పత్రాలను ప్రతీ ఇంటికి అందిస్తారు. అందులో ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏం జరిగిందీ..ఈ ప్రభుత్వంలో జరిగిన మంచిని వివరించేలా రూపొందించారు.

"పాస్ట్ వర్సెస్ ప్రెజెంట్" కరపత్రాన్ని కన్వీనర్లు ప్రతీ ఇంటికి అందిస్తారు. అదే విధంగా ప్రజా మద్దతు పుసక్తం ఒకటి ప్రతీ ఇంటికి ఇవ్వనున్నారు. ప్రతీ ఇంటి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని రసీదు ఇస్తారు. ప్రతీ ఇంటికి మొబైల్ స్టిక్కర్లు అంటిస్తారు. ప్రతీ ఇంటికి వెళ్లి వారి అనుమతితో డోర్ తో పాటుగా ఫోన్ పైనా స్టిక్కర్ అంటించేలా నిర్ణయం తీసుకున్నారు.

జగనన్న పాలనకు మద్దతుగా మిస్డ్ కాల్
ఈ ప్రచారంలో కొనసాగింపుగా మిస్డ్ కాల్ కార్యక్రమం డిసైడ్ చేసారు. జగనన్న పాలనకు మద్దతు తెలిపేందుకు 8296082960కి మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరనున్నారు. వారి ద్వారా ఎంత మేర ప్రజల నుంచి పాలనకు మద్దతు వచ్చిందీ అంచనాకు రానున్నారు.తొలి వారంలో 70 లక్షల మిస్డ్ కాల్స్ వచ్చే అవకాశం ఉందని పార్టీ అంచనా వేస్తోంది.

దీని ద్వారా ప్రతీ ఇంటికి ప్రభుత్వాన్ని దగ్గర చేయటంతో పాటుగా.. ప్రజల్లో ప్రభుత్వం పైన ఉన్న అభిప్రాయం..వారి నుంచి మద్దతు పైన పూర్తి స్పష్టత వచ్చేలా ఈ కార్యక్రమం రూపొందించారు. దీని ద్వారా ఈ నెల 20వ తేదీ తరువాత కార్యక్రమ నిర్వహణ పైన మరోసారి సమీక్ష చేయనున్నారు. ఎన్నికలకు నేతలను సంసిద్దులను చేసే క్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి నేటి సమావేశంలో తుది రూపు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+