శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేత దారుణ హత్య
శ్రీకాకుళం జిల్లా గార మండల ఉపాధ్యక్షుడు, వైసీపీ నేత రామశేషు దారుణ హత్యకు గురయ్యారు. శ్రీకూర్మంలోని తన గ్యాస్ గొడౌన్ వద్దకు మార్నింగ్ వాక్ గా వెళుతున్న సమయంలో దుండగులు ఆయన్ను హతమార్చారు. పల్సర్ బైక్‌పై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కత్తితో మెడపై దాడి చేసి హతమార్చినట్లు సమాచారం. ఘటనలో రామశేషు అక్కడికక్కడే మృతిచెందారు. రక్తపు మడుగులో ఉన్న ఆయన మృతదేహాన్ని చూసి బంధువులు రోదించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. హత్యకు కారణాలేమై ఉంటాయా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్‌మనోహర్‌నాయుడు, స్థానిక వైసీపీ నేతలు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అధికార పార్టీ నేతనే హత్య చేయడంతో పోలీసులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావుకు రామశేషు ప్రధాన అనుచరుడు.
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో పెళ్లికి నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది బీడీఎస్ విద్యార్ధినిని దారుణంగా గొంతుకోసి హతమార్చాడు. సర్జికల్ బ్లేడ్‌తో గొంతుకోసి కొనఊపిరితో ఉండగా ఒక గది లోంచి మరో గదిలోకి ఈడ్చుకుంటూ వెళ్లాడు. తలుపులు బిగించి మరీ దారుణానికి పాల్పడ్డాడు. కేకలు విన్న స్థానికులు బాధితురాలిని బయటకు తీసుకొచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. బాధిత యువతిని ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే ఆమె మరణించింది. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురానికి చెందిన తపస్వికి, అదే జిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన జ్ఞానేశ్వర్‌కు మధ్య ఇన్‌స్టాగ్రాం ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రెండు సంవత్సరాల నుంచి ప్రేమికులుగా ఉన్న వీరిద్దరూ.. ప్రేమకు సంబంధించి విభేదాలు రావడంతో జ్ఞానేశ్వర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
