జన్మభూమిలో ‘గున్నా మామిడి’ డ్యాన్సులు...వైసీపీ నేత రోజా ఫైర్

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

ప్రజాసమస్యలు పరిష్కరించడం కోసం అంటూ నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంలో టిడిపి నేతలు, అధికారులు డ్యాన్సులు రలు డ్యాన్సులు వేయడం ఏమిటని వైసీపీ నేత రోజా ఫైర్ అయ్యారు. జన్మభూమిలో డ్యాన్సులకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్ట్ చేసి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

"వందల కోట్లు ఖర్చుపెట్టి ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాలు నిర్వహిస్తోంది...ప్రజల సమస్యలు తెలుసుకోడానికా లేక డ్యాన్సులు వేసుకోడానికా?'' అని వైసిపి నేత రోజా ఘాటుగా ప్రశ్నించారు. జన్మభూమి కార్యక్రమంలో డ్యాన్సులకు సంబంధించి రెండు పోస్ట్ లు చేసిన రోజా వైసిపి అధినేత జగన్ కోసం ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాద యాత్ర చేస్తుంటే టిడిపి నేతలు జన్మభూమి కార్యక్రమంలో గున్నామామిడి వంటి పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారని, దీన్ని బట్టి ఎవరు ప్రజల పక్షమో మీరే నిర్ణయించండి అని ప్రశ్నించారు.

జన్మభూమి గురించి పెట్టిన మొదటి పోస్ట్ లో రోజా వైసిపి అధినేత జగన్ చేస్తున్న పాదయాత్రకు సంబంధించిన వీడియో పై భాగంలో, కింది భాగంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ యోగా క్లాసు సందర్భంగా చంద్రబాబు డ్యాన్స్ చేస్తున్న వీడియో, మరోవైపు జన్మభూమి కార్యక్రమంలో టిడిపి నేతలు, అధికారులు గున్మమామిడి పాటకు డ్యాన్సు చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో వీటన్నింటిని కలిపి పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కింద ట్యాగ్ లైన్ లాగా దీన్ని బట్టి ఎవరు ప్రజాపక్షమో మీరే నిర్ణయించండని ప్రశ్న పెట్టారు. రోజా పెట్టిన ఈ ఫేస్ బుక్ పోస్ట్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YCP MLA Roja Fires on AP CM Chandrababu Over dances in janmabhoomi programmes. "One side ycp doing prajasankalpa yatra and another side TDP leaders are doing dances like this, you decide who will be the people's side", Roja questioned in facebook.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి