మహాకూటమికి వెయ్యి కోట్లా? చంద్రబాబే ఫైనాన్షియరా?
తెలంగాణ ఎన్నికల సెగ ఏపీకి తాకింది. అక్కడ ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడ ప్రకంపనలు మొదలయ్యాయి. తాజాగా మహా కూటమిలో చేరిన టీడీపీ ఎన్నికల ఖర్చునంతా తానే భరిస్తోందంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే ఓటుకు నోటు కేసు చంద్రబాబుకు చుట్టుకుని ఉన్న తరుణంలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.
కూటమి అభ్యర్థులందరికీ చంద్రబాబు ఫైనాన్షియర్ గా మారాడని చెప్పడానికి ఇటీవల అమరావతిలో కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ఆయనతో సమావేశం కావడమే నిదర్శనమని హాట్ కామెంట్ చేశారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. ట్విట్టర్ లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చానీయాంశంగా మారాయి.
తెలంగాణ ఎన్నికలకు మహా కూటమి అభ్యర్ధులందరికీ నాయుడు బాబే ఫైనాన్షియర్. కాంగ్రెస్ నేత గెహ్లాట్ రాహుల్ దూతగా అమరావతి వచ్చి బాబుతో జరిపిన భేటీ వెనుక రహస్యం ఇదే. మొత్తం మీద 1000 కోట్లు పెట్టడానికి డీల్. ఇదంతా పాలు, కూరగాయలు అమ్మితే వచ్చిన లాభం కదా!
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 14, 2018

మహాకూటమికి వెయ్యికోట్లు ఇచ్చేలా చంద్రబాబు డీల్ కుదుర్చుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు విజయసాయి రెడ్డి. ఇంత పెద్ద మొత్తం పాలు, కూరగాయలు అమ్మితే వచ్చిన డబ్బులు కాదా అంటూ ప్రశ్నించారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై విజయసాయి రెడ్డి చేసిన మరో ట్వీట్ కూడా హాట్ టాపిక్ గా మారింది. 'వెయ్యిగొడ్లను తిన్న రాబంధు ఒక్క గాలివానకు కుప్పకూలుతుంది. పింగళి దశరథ రామ్‌ను, రాఘవేంద్ర రావును, మల్లెల బాబ్జీని, వంగవీటి రంగాను చంపించిన, ఇంకా ఎంతోమంది హత్యలకు పథక రచన చేసిన ముఠా అప్పుడు తప్పించుకోవచ్చు. కానీ జననేత వైఎస్ జగన్ హననానికి ప్రయత్నించిన కోడికత్తి ముఠా ఇప్పుడు తప్పించుకోలేదు' అని ఆయన పేర్కొన్నారు.
వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు కుప్పకూలుతుంది.పింగళి దశరథ రామ్‌ను,రాఘవేంద్ర రావును,మల్లెల బాబ్జీని,వంగవీటి రంగాను చంపించిన,ఇంకా ఎందరి హత్యలకో పథక రచన చేసిన ముఠా అప్పుడు తప్పించుకోవచ్చు.కానీ జననేత జగన్ గారి హననానికి ప్రయత్నించిన కోడి కత్తి ముఠా ఇప్పుడు తప్పించుకోలేదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 14, 2018
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications