రైతు రుణమాఫీ పై సీఎం జగన్ నిర్ణయం..!?
ఏపీలో ఎన్నికల రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది. అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి వర్సస్ జగన్ వ్యూహాలతో బరిలోకి దిగారు. ఇప్పటికే జగన్, చంద్రబాబు, పవన్ ప్రచారం ప్రారంభించారు. తాను అమలు చేసిన సంక్షేమం - సామాజిక న్యాయం తనను గెలిపిస్తాయని జగన్ నమ్ముకున్నారు. జగన్ పైన వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కూటమి విశ్వసిస్తోంది. ఇదే సమయంలో జగన్ పైన కొత్త వరాల కోసం ఒత్తిడి పెరుగుతోంది.
ఎన్నికల మేనిఫెస్టో
2019 ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేసామని జగన్ చెబుతున్నారు. ఇచ్చిన ప్రతీ హామీ నిలబెట్టుకున్నామని ప్రతీ సభలో వివరిస్తున్నారు. ఈ సారి మేనిఫెస్టోలో తాము అమలు చేసే అంశాలనే ప్రస్తావిస్తామని జగన్ ఇప్పటికే స్పష్టం చేసారు. ఏప్రిల్ 9 ఉగాది నాడు మేనిఫెస్టో ప్రకటనకు జగన్ ముహూర్తంగా నిర్ణయించారు. చెప్పామంటే చేస్తామంతే అనే నమ్మకంతో తాము ఇచ్చిన ప్రతీ హామీ అమలవుతుందని జగన్ స్పష్టం చేసారు. అయితే, తాను అమలు చేసిన పథకాల లబ్ది దారులే తన ఓటర్లుగా జగన్ విశ్వసిస్తున్నారు. ఈ సారి మేనిఫెస్టోలో ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకు కొన్ని మార్పులు చేయటంతో పాటుగా కొత్త వరాలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు.

జగన్ కసరత్తు
ప్రస్తుతం అమలు చేస్తున్న అమ్మఒడి పథకం కుటుంబలో ఒక్క విద్యార్దికే అందుతోంది. దీనిని ఇద్దరి వరకు పెంచే అవకాశం ఉందని సమాచారం. అదే విధంగా పెన్షన్ ను రూ 3 వేల నుంచి రూ 4 వేల వరకు విడతల వారీగా పెంచేలా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. యువత, మహిళలకు ఆర్దికంగా తోడ్పాటు అందించేలా కొత్త వరాలు ఉంటాయని పార్టీలో చర్చ సాగుతోంది. 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ అమలు చేసారు. ఈ సారి డ్వాక్రా మహిళలకు జగన్ ఎలాంటి వరాలు ఇవ్వబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. దాదాపు కోటి మంది డ్వాక్రా మహిళలు ఉండటం తో ఈ ఓట్ బ్యాంక్ కీలకం కానుంది. అటు చంద్రబాబు సూపర్ సిక్స్ తో ముందుకు వస్తున్నారు.

రుణమాఫీ కోసం వినతులు
రైతుకు భరోసా కింద ప్రస్తుతం జగన్ రూ 13 వేలు అందిస్తున్నారు. చంద్రబాబు ఈ మొత్తాన్ని రూ 20 వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు. అయితే, చంద్రబాబు ఇచ్చే హామీలు అమలు కావని జగన్ ప్రతీ సభలో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. విశ్వసనీయత తనకు ఉందని చెబుతున్నారు. ఈ సమయంలోనే జగన్ ఈ సారి ఎన్నికల వరంగా రైతు రుణమాఫీ ప్రకటించాలని ప్రస్తుత సిద్దం బస్సు యాత్రలో నిర్వహిస్తున్న ముఖాముఖిలో పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయి. ఈ హామీ ఇస్తే జగన్ కోరుకున్న విధంగా 175 సీట్లు గెలిపిస్తామంటూ సాధారణ జనం ఓపెన్ గానే చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు జగన్ రుణమాఫీ ప్రకటన చేస్తారా..డ్వాక్రా మహిళల కోసం తీసుకొనే నిర్ణయాలు ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో, జగన్ ఎలాంటి నిర్ణయాలు ప్రకటించబోతున్నారనేది ఆసక్తిని పెంచుతోంది.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications