వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మండిపాటు: ప్రశ్నించడానికి పుట్టిన పవన్ కళ్యాణ్ జనసేన ప్రశ్నార్థకమే!

By Pratap
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ప్రశ్నించడానికే పుట్టిన జనసేన ఉనికే నేడు ప్రశ్నార్ధకంగా మారిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ ర్రాష్ట ప్రధాన కార్యదర్శి సుంకర రామాంజనేయులు త్రీవ స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం అరండల్‌పేటలోని వైసీపీ నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆ వ్యాఖ్య చేశారు.

పవన్‌కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత నేటి వరకు ఏ ఒక్క ప్రజా సమస్యపైనా కనీసం ఆయన ఒక్క ప్రశ్ననైనా ప్రభుత్వంపై సంధించలేకపోయారని ఆరోపించారు. కొంపతీసి రాష్ట్రం సుభిక్షంగా విలసిల్లుతూ, సిరి సంపదలతో తులతూగుతూ, ప్రజలంతా చీకూ చింతా లేకుండా హాయిగా గడుపుతున్నట్లుగా పవన్ కల్యాణ్ భావిస్తున్నారేమో అని ఆయన ఎద్దేవా చేశారు.

సినిమాల్లో మాదిరి ఊహల్లో పల్లకీలో విహరించడం మాని వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని ఆయన పవన్‌కు హితవు పలికారు. ప్రస్తుతం గద్దె మీదున్న ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదన్న సంగతి తెలియదా? కాపులను బీసీల్లో చేరుస్తాననీ, సంవత్సరానికి వెయ్యి కోట్ల చొప్పున 5వేల కోట్లు ఇస్తాననీ నమ్మించి గొంతు కోసిన ఘోరం తెలియదా? అని ఆయన అడిగారు.

Pawan Kalyan

దానికి నిరసనగా సభ పెట్టుకుంటే అడుగడుగునా కల్పించిన ఆటంకాలు తెలియవా? అలా అడగడం కాపులకే నష్టమంటూ బాబు చేసిన వ్యాఖ్యలు తెలియవా?'' అని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.

అంతో ఇంతో పేపర్ నాలెడ్గ్జ ఉన్న ప్రతివారికీ తెలిసిన ఈ కఠోర నిజాలు కూడా పవన్ కల్యాణ్‌కు తెలియకపోవడం విచ్రితంగా ఉందని ఆయన విమర్శించారు. ర్రాష్టంలో ఏ మూల చూసినా ఏదో ఒక సమస్యతో ప్రజలు సతమతమ వుతున్న సంగతి ఇప్పటికైనా ఆయన గ్రహించాలని కోరారు. ప్రశ్నల సంగతి పక్కనబెట్టి ప్రభుత్వంపై పోరుబాట పట్టాలని సూచించారు.

లేదంటే తెలుగుదేశం రబ్బర్‌స్టాంప్‌గా...చ్రందబాబు అద్దె మైకుగా మిగిలిపోతారని హెచ్చరించారు. కాపులు సొంతం చేసుకున్నారు గనకనే చిరంజీవి మెగాస్టార్ అయ్యారనీ, పవన్‌కళ్యాణ్ అయ్యారనీ, అలాంటి కాపుల సంక్షేమాన్ని చ్రందబాబు కాళ్ళ వద్ద తాకట్టు పెట్టే రీతిలో వ్యవహరిస్తే కాపు జాతి క్షమించదనీ సుంకర రామాంజనేయులు స్పష్టం చేశారు.

English summary
YSR Congress party leader YSR Congress lashed out at Jana Sena chief Pawan Kalyan on Kapu resrvations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X