తిరుమల టికెట్లు అమ్ముకున్నారు.. చెవిరెడ్డి సిఫార్సు లేఖతో 56మందికి బ్రేక్ దర్శనం, వసతి; ఆధారాలివిగో!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పోయి టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి రాజీనామా చేయడం, ఆపై టీటీడీ ఈవో ధర్మారెడ్డిని మార్చి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జేఎస్ శ్యామల రావును నియమించటం కూడా చకచకా జరిగిపోయాయి.

తిరుమల టికెట్లు అమ్ముకున్నారని ఆనం వెంకటరమణా రెడ్డి సంచలన పోస్ట్
ఇదిలా ఉంటే తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతిలో టికెట్లు అమ్ముకున్నారని, టీటీడీని బ్రష్టు పట్టించారని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ క్రమంలో తాజాగా మరోమారు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన పోస్ట్ చేశారు.

YCP leaders sold Tirumala tickets anam venkataramana reddy posted Chevireddy recommendation letter as evidence

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుతో ఇచ్చిన సిఫార్సు లేఖలో 56మంది
ఆ పోస్టులో ఆనం వెంకట రమణారెడ్డి వైసీపీ చంద్రగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుతో ఇచ్చిన సిఫార్సు లెటర్ ను పోస్ట్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన సిఫార్సు లేఖలో 13 మంది పేర్లు ఉన్నాయి. అందులో ఒక్కొక్కరి పేరు పక్కన ఆరుగురు సభ్యులు, నలుగురు సభ్యులు, ముగ్గురు సభ్యులు, ఐదుగురు సభ్యులు ఇలా మొత్తం 56 మందికి సంబంధించిన లిస్టు ఉంది.

తిరుమల టికెట్ అమ్ముకున్న రుజువులు ఇదిగో అంటూ పోస్ట్
వీరంతా హైదరాబాద్ కు చెందినవారిగా పేర్కొన్నారు. వీరందరికీ శ్రీ పద్మావతి నిలయంలో వసతి కల్పించాలని, బ్రేక్ దర్శనం కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. నిబంధనలను తుంగలో తొక్కి టికెట్లు అమ్ముకున్నారు. ఇక దీనిని పోస్ట్ చేసిన ఆనం వెంకట రమణారెడ్డి తిరుమల టికెట్ అమ్ముకున్న వెధవలు ఇదిగో రుజువులు అంటూ వైసీపీ నేతలను టార్గెట్ చేశారు. సిఫార్సు లేఖలో ఇంతమందికి ఎలా ఇచ్చారు..

వైసీపీ హయాంలో టీటీడీలో అక్రమాలపై ఆగ్రహం
ఇదంతా టికెట్లు అమ్ముకున్న వ్యవహారమే అని ఆయన అర్ధం వచ్చేలా ఆ పోస్ట్ ఉంది. గతంలో కూడా వైసిపి అధికారంలో ఉన్న సమయంలో టీటీడీలో జరుగుతున్న దారుణాల విషయంలో ఆనం వెంకట రమణారెడ్డి స్పందించారు. నాడు టిటిడి ఇన్చార్జి ఈవోగా ఉన్న ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్ అంటూ మండిపడ్డారు. శ్రీవారి ప్రోటోకాల్ టికెట్లను కూడా అమ్ముకుంటున్నారని, ముఖ్యంగా రోజా పైన కూడా ఆయన మాటల దాడి చేశారు. టిటిడి పేరుతో సేవ కాదు దోచుకోవడమే వైసిపి నేతల పని అంటూ అనేక సందర్భాలలో ఆనం వెంకటరమణారెడ్డి వైసీపీ నేతల తీరును టార్గెట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+