నామినేషన్లు వేయటానికి దమ్ము లేదు కానీ ఆ సత్తా ఉందా ? టీడీపీకి వైసీపీ మంత్రి అనిల్ సవాల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ మంత్రులు ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసురుతున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీదే పై చేయి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల్లో హిస్టరీ క్రియేట్ చేయడం మాకే సొంతమంటూ ధీమా వ్యక్తం చేసిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబుపై , చంద్రబాబుకు సహకరిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికల విషయంలో సవాల్ విసిరారు.

నామినేషన్లు వేయడానికి దమ్ము లేదు కానీ చంద్రబాబు చిల్లర రాజకీయాలు
నామినేషన్లు వేయడానికి దమ్ము లేదు కానీ ఎన్నికల కమిషన్ ను అడ్డుపెట్టుకొని చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నేడు కర్నూలులో మీడియాతో మాట్లాడిన మంత్రి రానున్న పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పూర్తిస్థాయిలో సత్తా చాటబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కనీసం నామినేషన్ వేసేశక్తి, ధైర్యం లేని పార్టీలు ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పుకుంటున్నాయి అని ఎద్దేవా చేశారు.

ప్రధాన ప్రతిపక్షం 25% సీట్లను, ఇక తోక పార్టీలు 5 శాతమైనా సీట్లను సాధించే దమ్ముందా ?
ఎన్నికల్లో మాదే విజయం అని చెప్పుకుంటున్న ప్రధాన ప్రతిపక్షం 25% సీట్లను, ఇక తోక పార్టీలు 5 శాతమైనా సీట్లను సాధించే సత్తా ఉందా? అంటూ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు.
విజయ డైరీ ఎన్నికల్లో 80% ఓట్లతో గెలిచామని, పంచాయతీ ఎన్నికల్లోనూ 80 శాతం సీట్లు ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో వైసిపి సత్తా చూపిస్తామని ప్రకటించారు.

రికార్డులను బ్రేక్ చేయడం , ఎన్నికల్లో హిస్టరీ క్రియేట్ చేయడం మాకే సొంతం
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే రేపటి ఎన్నికల్లో వైసీపీకి విజయం చేకూరుస్తాయని, వైసీపీ విజయానికి నిదర్శనం అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. రికార్డులను బ్రేక్ చేయడం , ఎన్నికల్లో హిస్టరీ క్రియేట్ చేయడం తమకే సాధ్యమవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. నంద్యాల విజయ డైరీ డైరెక్టర్ చైర్మన్ ఎన్నిక విషయంలో భారీ మెజారిటీతో గెలుపొందటానికి కృషిచేసిన నంద్యాల పార్లమెంట్ ఎమ్మెల్యేలకు మంత్రి అభినందనలు తెలియజేశారు. ఎన్నికలు ఏవైనా విజయం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications