వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమత పెట్టిన మంట : టెక్ చంద్రబాబుతో దేశానికే ముప్పు.. పెగాసస్‌పై విచార‌ణ‌కు అంబ‌టి డిమాండ్ !!

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా పెగాసస్ స్పైవేర్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష నేతల మధ్య మాట యుద్ధానికి దారితీసింది. ఇటీవల మమతా బెనర్జీ పెగాసస్ స్పైవేర్ గురించి మాట్లాడుతూ .. నాలుగేళ్ల కిందట చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ ప్రభుత్వం దీనిని కోనుగోలు చేశారంటూ బాంబు పేల్చారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను రూ. 25 కోట్లకు అందిస్తామంటూ నాడు బెంగాల్‌లోని తమ ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు అందాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

చంద్ర‌బాబు పాల‌న‌లో పెగాస‌స్ కొనుగోలు..

చంద్ర‌బాబు పాల‌న‌లో పెగాస‌స్ కొనుగోలు..

టీడీపీ అధినేత చంద్రబాబుపై అదికార వైసీపీ నేత‌లు విమర్శలు గుప్పిస్తున్నారు. భారతదేశంలో టెక్నాలజీకి ఆద్యుడ్ని నేనే అని చెప్పుకుంటూ.. ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు .. దేశానికే పెద్దముప్పు తెచ్చిపెట్టారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. నాడు చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ కొనుగోలు చేసి వాడినట్లు సాక్షాత్తు మమతా బెనర్జీయే చెప్పారు. చంద్రబాబుకు మమతా జెనర్టీ మిత్రురాలు. ఇద్దరు కలిసి కొంతకాలం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారని అంబటి గుర్తు చేశారు.

 ఏదో మ‌ర్మం దాగి ఉంది..

ఏదో మ‌ర్మం దాగి ఉంది..


తాము ఎప్పుడూ చంద్రబాబు పెగాసస్ వాడారని చెప్పలేదన్నారు అంబటి.. బాబు మిత్రురాలే ఇవాళ వాస్తవాలను బయటపెట్టారని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలకు ఇప్పుడు టీడీపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారంటే దీనిలో ఏదో మర్మం దాగిఉందని అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో అనైతిక రాజకీయాలకు పాల్పడే వ్యక్తి చంద్రబాబే అని విమర్శించారు. ఆయన జీవితమంతా అనైతిక రాజకీయాలే అని ఎద్దేవా చేశారు..

ట్యాంపింగ్‌కు పాల్ప‌డ‌లేదా?

ట్యాంపింగ్‌కు పాల్ప‌డ‌లేదా?


చంద్రబాబు దుర్మార్గాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని అంబటి ఆరోపించారు. పెగాసస్‌పై వెంటనే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణ జరిపితే అసలు విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహారించారని ఆరోపించారు. గత టీడీపీ పాలనలో చంద్రబాబు ఫోన్ ట్యాంపింగ్‌కు పాల్పడలేదా ? అని ప్రశ్నించారు. పెగాసస్‌ను అధికారికంగా కొనకపోయినా ప్రైవేటుగానైనా కొనుగోలు చేసి ఉంటారని ఆరోపించారు. ప్రత్యర్థుల వీక్‌నెస్‌ను అడ్డం పెట్టుకుని తాము రాజకీయాలు చేయమన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడినట్లు కోర్టు కూడా ప్రధమికంగా భావించిందని ఆయన పేర్కొన్నారు. అధికార దుర్వినియోగానికి టీపీపీతో కలిపి పాల్పడ్డారని అంబటి ఆరోపించారు.

English summary
Pegasus scandal in AP politics.. YCP leaders accuse Chandrababu and Demand for trial ..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X