కోహ్లీ నిర్ణయంపై వైసీపీ మహిళా ఎమ్మెల్యే షాకింగ్ - వెంటనే స్పందిస్తూ : ట్వీట్ వైరల్..!!

సంక్రాంతి సంబరాల్లో అందరూ ఆనందంతో ఉన్న సమయంలో టీమిండియా డాషింగ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం ప్రకటించారు. తాను భారత టెస్టు జట్టు కెప్టెన్నీ నుంచి తప్పుకుంటున్నట్లు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. ఇది ఒక్క సారిగా విరాట్ అభిమానులకు షాకింగ్ న్యూస్ గా మారింది. ఇదే అంశం పైన చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ స్పందించారు. ఇలాంటి వార్తను కచ్చితంగా ఇప్పుడు తాము వినాలనుకోలేదని ఎమ్మెల్యే విడదల రజనీ అభిప్రాయపడ్డారు. కానీ కోహ్లీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని తెలిపారు.

కోహ్లీ నిర్ణయం - వైసీపీ ఎమ్మెల్యే స్పందన

కోహ్లీ నిర్ణయం - వైసీపీ ఎమ్మెల్యే స్పందన

భారత క్రికెట్‌కు విరాట్ కోహ్లీ అందించిన సేవలకు వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో విరాట్ కోహ్లీ క్రికెట్‌లో బాగా రాణించాలని.. ఆయన మరింత రాణించి సెంచరీల మీద సెంచరీలు చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ ట్వీట్ చేశారు.

సాధారణంగా రాజకీయంగా యాక్టివ్ ఉండే ఎమ్మెల్యే రజనీ..ఇప్పుడు కోహ్లీ నిర్ణయం పైన స్పందించటంతో సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్ అవుతోంది. తన ట్వీట్ తో పాటుగా విరాట్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ చేసిన ట్వీట్ ను జత చేసారు. అందులో కోహ్లీ... టెస్టు జట్టు కెప్టెన్‌గా నేను తప్పుకోవాల్సిన సమయమిది. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి.

తాము గౌరవిస్తామంటూనే

తాము గౌరవిస్తామంటూనే

కానీ నా ప్రయత్నాలు, విశ్వాసం మాత్రం ఎన్నటికీ క్షీణించలేదు. నేను ఎల్లప్పుడూ ప్రతిదానిలో 120% సహకారం అందించాలనుకుంటున్నాను. నేను అలా చేయలేకపోతే అది తప్పు అవుతుంది. నేను ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాను. నా బృందంతోనూ నేను నిజాయితీగా ఉండలేను" అంటూ పేర్కొన్నాడు. "ఇంత కాలం నా దేశానికి నాయకత్వం వహించే అవకాశం ఇచ్చినందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

దీనితో పాటు, మొదటి రోజు నుంచి నా దృక్పథాన్ని విశ్వసించి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయుధాలను వదులుకోని నా సహోద్యోగులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు నా ప్రయాణాన్ని చిరస్మరణీయంగా, అందంగా మార్చారు. రవి భాయ్‌తోపాటు సపోర్ట్ గ్రూప్‌లోని వారంతా ఈ వాహనానికి ఇంజిన్‌లు. వీరు టెస్ట్ క్రికెట్‌ను నిరంతరం గొప్ప ఎత్తులకు పెంచారు.

విరాట్ నిర్ణయం పై భారీగా రియాక్షన్స్

విరాట్ నిర్ణయం పై భారీగా రియాక్షన్స్

నా దృష్టిని రియాలిటీగా మార్చడంలో మీరందరూ ముఖ్యమైన పాత్ర పోషించారు. చివరగా, కెప్టెన్‌గా నాపై ఎంతో నమ్మకం ఉంచిన ఎంఎస్ ధోనీకి ప్రత్యేక ధన్యవాదాలు. నేను భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు అతను నన్ను అర్హుడని భావించాడు" అంటూ తన అభిప్రాయాలను ప్రకటనలో వెలిబుచ్చాడు.

టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కాకముందే కోహ్లీ ఈ ఫార్మాట్‌ నుంచి సారథిగా తప్పుకున్నాడు. అదే సమయంలో, దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు, అతను వన్డే కెప్టెన్సీ పదవి నుంచి బీసీసీఐ తొలగించింది. వైట్ బాల్ క్రికెట్‌కు ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదని సెలక్టర్లు ప్రకటించారు. ఇప్పుడు కోహ్లీ నిర్ణయం పైన క్రికెట్ ఫ్యాన్స్ లో చర్చ సాగుతుంటే..ఎమ్మెల్యే రజనీ ట్వీట్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ కు కారణమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+