వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నైట్ కల్చర్ తెచ్చిందే చంద్రబాబు..క్యాసినో పేరుతో రాజకీయం..టీడీపీ నేతలపై శ్రీకాంత్ రెడ్డి ఫైర్

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో నైట్ లైఫ్ కల్చర్‌కు బీజం వేసిందే టీడీపీ అధినేత చంద్రబాబు అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. క్యాసినో పేరుతో టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ అయిపోయి పదిరోజులు దాటుతున్నా ఇంకా జూదం, పేకాట, క్యాసినో అంటూ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

నైట్ లైఫ్ కల్చర్ తెచ్చిందే చంద్ర‌బాబు

నైట్ లైఫ్ కల్చర్ తెచ్చిందే చంద్ర‌బాబు

సీఎంగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాడే.. రాష్ట్రంలో జూదం, క్లబ్‌లపై ఉక్కుపాదం మోపారన్నారు శ్రీకాంత్ రెడ్డి. గతంలో చంద్రబాబే తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్‌లో నైట్ కల్చర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారని గుర్తు చేశారు.

నైట్ లైఫ్ కల్చర్ ఉంటేనే మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయన్నారని పేర్కొన్నారు. పబ్‌లు , బార్లు, డిస్కోలు, క్యాసినోలే నైట్ లైఫ్ అన్నట్లు చంద్ర‌బాబు చెప్పాకొచ్చార‌ని శ్రీకాంత్ రెడ్డి విమ‌ర్శించారు. ఇవాళ తమ ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు కుట్ర‌

శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు కుట్ర‌

రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు టీడీపీ, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండడం చంద్రబాబుకు ఇష్టం లేదని మండిపడ్డారు. ఉద్యోగులను బెదిరించిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. టీడీపీ పాలనలో సంఘాలు ఏర్పాటు చేసుకుంటే .. చంద్రబాబు వారిని అంతు చూస్తా.. తోకలు కత్తిరిస్తానంటూ బెదిరించారని ఆరోపించారు. ఇప్పుడు ఆ సంఘాలనే.. ఏకతాటిపైకి రావాలంటూ చంద్ర‌బాబు పిలుపునిచ్చారని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు.

Recommended Video

KCR Follows Ys Jagan | Why Spreading Venom When Govt Does Good ? | Oneindia Telugu
ఉద్యోగుల‌తో చ‌ర్చ‌ల‌కు ప్ర‌భుత్వం సిద్ధం

ఉద్యోగుల‌తో చ‌ర్చ‌ల‌కు ప్ర‌భుత్వం సిద్ధం

ఉద్యోగుల పట్ల సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్ర పరిస్థితులను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని పేర్కొన్నారు. విపక్షాల ట్రాప్‌లో పడవద్దన్నారు.

ప్రభుత్వానికి భారమైన ఉద్యోగుల సంక్షేమాన్ని సీఎం జగన్ కట్టుబడిఉన్నారన్నారు. ఉద్యోగులు అడగకపోయినా 27శాతం ఐఆర్ ను ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. వైసీపీ ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల‌ను స‌మ‌భావంతో చూస్తోంద‌న్నారు. ఏ ఒక్క‌రికి అన్యాయం చేసే ఉద్దేశం ప్ర‌భుత్వానికి లేద‌ని తెలిపారు. సీఎం జ‌గ‌న్ ను కించ‌ప‌ర్చేలా కొంద‌రు మాట్లాడుతున్నార‌ని .. ప‌ద్ధ‌తి మార్చుకోవాల‌ని హెచ్చ‌రించారు.

English summary
YSRCP MLA Srikanth Reddy fire on Chandrababu...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X