వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాగా లేవని చెబుతూ విహారయాత్రలా, మా ఎమ్మెల్యేలు దూరం: జ్యోతుల నెహ్రూ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ శానససభ్యులను మూడు రోజుల పాటు పర్యటనలకు తీసుకుని వెళ్లాలనే స్పీకర్ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాకుుడ జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ యాత్రకు వెళ్లకూడదని తమ పార్టీ శాసనసభ్యులు నిర్ణయించుకున్నట్లు ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

రాష్ట్ర పరిస్థితులు బాగా లేవని చెబుతూనే ఇలా విహారయాత్రలకు వెళ్లడం ఎంత వరకు సమంజసమని ఆయన అడిగారు. అసెంబ్లీ వర్షాకాలం సమావేశాలు కేవలం 5 రోజుల్లో ముగించాలనే నిర్ణయాన్ని కూడా తాము వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. కనీసం 20 రోజులైనా సమావేశాలను నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

పలు ప్రజా సమస్యలపై శాసనసభలో చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై తన వైఖరిని వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే శాసనసభా సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించాలని ఆయన అన్నారు.

YCP MLAs reject tour with speaker: Jyothula Nehru

పట్టిసీమతో సీమకు నీరు ఎలా..

ధవళేశ్వరంలో సరిపడే నీటిమట్టం లేకుండా పట్టిసీమ ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు విశ్వరూప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పట్టిసీమ నిర్మాణం వల్ల కృష్ణా డెల్టాలో 35 టిఎంసిల నీరు కోల్పోతామని ఆయన చెప్పారు.

పట్టి సీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరు అందించడం ఎలా సాధ్యమవుతుందని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులన్నీ నాసిరకంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.

English summary
The YSR Congressparty leader Jyothula Nehru opposed the the MLAs tour proposed by Andhra Pradesh speaker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X