• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉప ఎన్నికలు జరిగుంటే...వైసిపి అభ్యర్థులు చిత్తుగా ఓడేవారు:చంద్రబాబు

By Suvarnaraju
|

అమరావతి:భాజపా, ఆ పార్టీతో కుమ్మక్కైన వైకాపాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్లేషించారు. కుట్ర రాజకీయాలపై పార్టీ కార్యకర్తల్లో, ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తిరుపతి టిడిపి నేతల సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు.

బుధవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్యనేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తిరుపతిలో అన్ని స్థానాలు మనమే గెలుస్తామన్నారు.

ఎన్నికలు జరిగుంటే...ఓడిపోయేవారు

ఎన్నికలు జరిగుంటే...ఓడిపోయేవారు

వైకాపా ఎంపీలు రాజీనామాలు చేసిన అయిదు పార్లమెంటు స్థానాలకు ఉపఎన్నికలు జరిగి ఉంటే ఆ పార్టీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయేవారని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన టిడిపి ముఖ్య నేతలతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలు జరగలేదు కాబట్టి వైసిపికి గుణపాఠం చెప్పే అవకాశం రాలేదన్నారు. ఈ సమావేశంలోమంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని, బీదా రవిచంద్ర యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

భాజపా,వైకాపాపై...వ్యతిరేకత

భాజపా,వైకాపాపై...వ్యతిరేకత

బిజెపి, ఆ పార్టీతో కుమ్మక్కైన వైకాపాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. వారి కుట్ర రాజకీయాలపై కార్యకర్తల్లో అవగాహన పెంచాలని...ప్రజల్ని చైతన్యపరచాలని చంద్రబాబు ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ నేతలకు సూచించారు. ప్రజలు కూడా కుట్ర రాజకీయాలను అర్థం చేసుకుంటున్నారని...పార్టీ నేతలు చేయాల్సిందల్లా వాస్తవాలు తెలియజెప్పడమే అన్నారు.

టిడిపి...బలం పెరిగింది

టిడిపి...బలం పెరిగింది

గతంలో కంటే క్రైస్తవ, ముస్లిం మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలలో తెలుగు దేశం పార్టీ బలం పెరగడం సానుకూల పరిణామమన్నారు. దీన్ని పార్టీ నాయకులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రజల్ని మెప్పించడంలోనే ఏ నాయకుడి సామర్థ్యమైనా బయటపడుతుందని, అదే ముఖ్యం అన్నారు. పార్టీ కార్యకర్తలకు నాయకులు పూర్తి సమయం కేటాయించాలని చంద్రబాబు హెచ్చరించారు.

తిరుపతి...అద్భుత భవిష్యత్తు

తిరుపతి...అద్భుత భవిష్యత్తు

తిరుపతి పార్లమెంటు సీటును చివరి నిమిషంలో భాజపాకి ఇవ్వడం వల్ల 2014 ఎన్నికల్లో దెబ్బతిన్నామని, నాలుగు అసెంబ్లీ స్థానాల్లో తెదేపా గెలిచినా, ఎంపీ సీటు కోల్పోవడానికి అభ్యర్థి ఖరారులో జరిగిన జాప్యమే కారణమని చంద్రబాబు విశ్లేషించారు. పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటుతో పాటు, ఏడు శాసనసభ స్థానాలను గెలుస్తామని చంద్రబాబు చెప్పారు. తిరుపతికి అద్భుతమైన భవిష్యత్తు ఉందన్నారు. దేశంలోనే నెం.1 నియోజకవర్గంగా తిరుపతి రూపొందుతోందని తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amaravati: TDP Chief Chandrababu has been analyzed that there is strong opposition in the people over BJP,YCP because of their collusion politics. Chandrababu commented on the review meeting of Tirupati TDP leaders held at Camp office.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more