పవన్ కల్యాణ్ గురించి అసలు విషయం చెప్పిన వైసీపీ ఎంపీ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అసలు విషయం చెప్పారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు 30 అడుగుల విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తోపాటు స్థానిక ఎంపీ రఘురామకృష్ణంరాజు గైర్హాజరయ్యారు. తనను ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా అడ్డుకుందని, అందుకే తాను హాజరుకాలేకపోయినట్లు రఘురామ చెప్పిన విషయం తెలిసిందే.
తాజాగా గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ తాను ఆ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేకపోయానో వెల్లడించారు. స్థానిక ఎంపీ రఘురామకృష్ణంరాజును ఆహ్వానించకపోవడంవల్లే భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు పవన్ ప్రకటించారు. అరికాళ్లపై కొట్టించి నడవలేకుండా చేశారని, అది రఘురామపై జరిగిన దాడి కాదని, క్షత్రియులందరిపై జరిగిన దాడిగా పవన్ అభివర్ణించారు. దీనికి రఘురామ స్పందించి ఒక వీడియోను ట్వీట్ చేశారు.
సిఐడి పోలీసులు నా పై చేసిన క్రూరమైన దాడిని మీరు ఖండించినందుకు మీకు నా ధన్యవాదాలు @PawanKalyan గారు. pic.twitter.com/LYFpl5k7Uu
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) July 17, 2022

''తనను రానివ్వకుండా అడ్డుకున్నందుకు నిరసనగా అంత గొప్ప కార్యక్రమానికి పవన్ హాజరుకాకపోవడం ఆయనలాంటి ధైర్యమున్న నాయకులకు మాత్రమే సాధ్యమని, ఆ ధైర్యానికి హ్యాట్సాఫ్'' అని రఘురామ వ్యాఖ్యానించారు. అలా చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలని, ఆయన ఎంతో ధైర్యం ఉన్న వ్యక్తి, గట్స్ ఉన్న రాజకీయ నేత అని కొనియాడారు. తనకు బాసటగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సీఐడీ పోలీసులు తనపై చేసిన దాడిని ఖండించినందుకు కూడా థాంక్స్ చెప్పారు.












Click it and Unblock the Notifications