ప్రజలను మభ్యపెట్టేలా.. వైసీపీ ప్లీనరీ కాదు అదో డ్రామా గ్యాలరీ: అచ్చెన్నాయుడు, వర్లరామయ్య ధ్వజం

గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ దగ్గర వైసీపీ ప్లీనరీ కొనసాగుతోంది . దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని వైయస్సార్ సిపి నిర్వహిస్తున్న ప్లీనరీ నేపథ్యంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యలు వైసిపి ప్లీనరీ పై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్లీనరీ కాదు డ్రామా గ్యాలరీ అంటే అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్లీనరీ పేరుతో జగన్ అధికార దుర్వినియోగం

ప్లీనరీ పేరుతో జగన్ అధికార దుర్వినియోగం

ప్లీనరీ పేరుతో జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ప్లీనరీ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీకి పది కోట్ల రూపాయల నష్టం అని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్పి, మూడు సార్లు టికెట్ చార్జీలు పెంచారని గుర్తు చేసిన అచ్చెన్నాయుడు ప్రతిపక్ష పార్టీల సభలు పెట్టుకుంటే కుంటి సాకులు చెప్పి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసే ప్రభుత్వం, నేడు వైసిపి ప్లీనరీ కి మాత్రం సకల మర్యాదలు చేస్తోందంటూ మండిపడ్డారు.

టీడీపీ మహానాడుకు ఇబ్బందులు.. ఇప్పుడు వైసీపీ ప్లీనరీకి రెడ్ కార్పెట్ వేసి సేవలు

టీడీపీ మహానాడుకు ఇబ్బందులు.. ఇప్పుడు వైసీపీ ప్లీనరీకి రెడ్ కార్పెట్ వేసి సేవలు

అధికార పక్షానికి ఒక న్యాయం ప్రతిపక్షానికి మరో న్యాయమా అంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తే ఆర్టీసీ బస్సులకు, ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఇవ్వలేదని, రాజధాని అమరావతి కోసం రైతులు నిర్వహించిన పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని ఇక ఇప్పుడు వైసిపి ప్లీనరీకి మాత్రం రెడ్ కార్పెట్ వేసి మరీ సేవలు చేస్తున్నారంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నాగార్జున యూనివర్సిటీ కి సెలవు ఇచ్చి మరీ వైసీపీ ప్లీనరీ నిర్వహించడం దేనికని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

డ్వాక్రా మహిళలను బెదిరించి మరీ ప్లీనరీకి తరలిస్తున్నారన్న అచ్చెన్న

డ్వాక్రా మహిళలను బెదిరించి మరీ ప్లీనరీకి తరలిస్తున్నారన్న అచ్చెన్న

అంతేకాదు డ్వాక్రా మహిళలను బెదిరించి ప్లీనరీకి తరలిస్తున్నారని ఆరోపణలు గుప్పించిన అచ్చెన్నాయుడు స్కూల్ బస్సులు, ప్రైవేటు వాహనాలను బలవంతంగా లాక్కుంటున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ పై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. వైసీపీ ప్లీనరీలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం పేలవంగా ఉందని వర్ల రామయ్య పేర్కొన్నారు. జగన్ తాను ముఖ్యమంత్రిని అన్న విషయం మరిచి, కేవలం ప్రతిపక్ష నేతను తిట్టడం కోసమే తన సమయాన్ని వెచ్చించినట్టు కనిపించిందని వర్ల రామయ్య పేర్కొన్నారు.

చంద్రబాబును తిట్టటం కోసమే వైసీపీ ప్లీనరీనా ? ప్రశ్నించిన వర్ల రామయ్య

చంద్రబాబును తిట్టటం కోసమే వైసీపీ ప్లీనరీనా ? ప్రశ్నించిన వర్ల రామయ్య


చంద్రబాబును దూషిస్తూ పబ్బం గడుపుకున్నారని మండిపడ్డారు. వైసిపి ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన విషయాన్ని ఇప్పటికీ గుర్తించడం లేదని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్ధిక స్థితి గతులు పతనావస్థలో ఉంటే, ఆ విషయాలేవీ ప్రస్తావించకుండా, ప్రజలను మభ్య పెట్టడం కోసం ప్రయత్నం చేశారని వర్ల రామయ్య పేర్కొన్నారు. ప్లీనరీలో ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రజల సమస్యలను ప్రస్తావించాలని, ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికను తెలియజేయాలని వర్ల రామయ్య వైసీపీ నేతలకు గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+