ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిద్దం..!!
ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల అధినేతలు తమ గెలుపు పైన ధీమాతో కనిపిస్తున్నారు. సర్వే సంస్థలు నివేదికలను పార్టీలు సేకరించాయి. గతం కంటే భిన్నంగా ఈ సారి ఫలితాలు వెల్లడి కాకముందే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేస్తున్నారు. ఈ దిశగా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు.
ఫలితాల ఉత్కంఠ
ఏపీలో తుది ఫలితాలకు మరో మూడు రోజుల సమయం ఉంది. కానీ, పార్టీలు మాత్రం తమదే గెలుపు అంటూ ప్రమాణ స్వీకారానికి సిద్దం అవుతున్నాయి, ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకార ముహూర్తం ఆ పార్టీ నేతలు ప్రకటించారు. జూన్-9న విశాఖలో ఉదయం 9.30 గంటలనుంచి 11.30 గంటల మధ్య సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహిస్తామని చెప్పారుఈసారి వైసీపీ భారీ మెజార్టీతో గెలవబోతుందని చెబుతున్నారు. వర్షం పడుతున్నా కొన్ని చోట్ల ప్రజలు క్యూలైన్లలో వేచి ఉండి మరీ ఓటు వేశారంటే.. జగన్ ని గెలిపించుకోడానికేనని పార్టీ ముఖ్యులు వివరిస్తున్నారు.

ప్రమాణ స్వీకారం
గెలుపు ధీమా.. వైసీపీలో గెలుపు ధీమా బలంగా ఉంది. వైనాట్ 175 అంటూ సీఎం జగన్ ధీమాగా ఉంటే.. నాయకులు కూడా అదే నెంబర్ రిపీట్ చేస్తున్నారు. గతంలో 151 స్థానాల్లో వైసీపీ విజయం కూడా ఊహించనిదే, ఈసారి మొత్తం 175 స్థానాల్లో గెలిచి, ఊహలకు అందని విజయాన్ని అందుకుంటామని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ఏపీ రిజల్ట్ చూసి దేశం మొత్తం షాక్ అవుతుందని ఈపాటికే సీఎం జగన్ హింట్ ఇచ్చారు. దీంతో..జగన్ చెప్పిన విధంగా ఆ నెంబర్ సాధ్యమేనా..వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశం పైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అధినేతల్లో ధీమా
అటు కూటమిలో మాత్రం గెలుపు ధీమా కేడర్ లో ఎక్కువగా కనిపిస్తుంది. కూటమి గెలుస్తుందని అంటున్నారే కానీ, సీట్ల విషయంలో ఎవరి లెక్కలు వారివి అన్నట్టుగా ఉంది. చంద్రబాబు జూన్ 9న అమరావతి లో ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు.వైసీపీ నేతలు మరో అడుగు ముందుకేసి జూన్-9 కోసం విశాఖకు ప్రయాణాలు కూడా ఫిక్స్ చేసుకున్నారు. అక్కడ హోటల్ రూమ్స్ అన్నీ ముందుగానే బుక్ అయిపోయినట్టు చెబుతున్నారు. అయితే, అసలు ఫలితాలు రాకముందే పార్టీలు ధీమాగా చెబుతున్న అంశాలు ఫలితాల పైన మరింత ఉత్కంఠ పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications