చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వారసుడికి వైసీపీ సీటు ఖరారు..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం రాజుకుంది. వై నాట్ 175 నినాదంతో సీఎం జగన్ తిరిగి అధికారం పైన విశ్వాసంతో ఉన్నారు. ప్రతిపక్ష టీడీపీ, జనసేన ఇప్పటికే పొత్తు ప్రకటించాయి. వచ్చే ఎన్నికలకు అభ్యర్దులను ఖరారు చేయటం పైన వైసీపీ అధినాయకత్వం ఫోకస్ చేసింది. వారసులను బరిలో దింపే విషయంలో వైసీపీలో పెద్ద ఎత్తున డిమాండ్లు ఉన్నాయి. ఇదే సమయంలో మరో కీలక నియోకవర్గానికి వారసుడినే పార్టీ అభ్యర్దిగా ప్రకటిస్తూ నిర్ణయం జరిగింది.

చంద్రగిరి అభ్యర్ది ఖరారు : వైసీపీలో సీట్ల ఖరారుపై తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ క్లారిటీ ఇచ్చారు. ఎక్కువ మందికి తిరిగి సీట్లు వస్తాయని..కొందరికి ఇవ్వలేనని స్పష్టం చేసారు. ఇవ్వని వాళ్లు తన వాళ్లు కాకుండా పోరని చెప్పుకొచ్చారు. గెలుపే ప్రామాణికంగా అభ్యర్దుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేసారు. ఇదే సమయంలో పార్టీలో సీనియర్లు కొందరు ఈ సారి ఎన్నికల్లో తమ వారసులను బరిలోకి దింపాలని భావిస్తున్నారు. కానీ, వారి విషయంలో ఇంకా కొందరికి సీఎం నుంచి హామీ దక్కలేదు. తాజాగా ఇద్దరు వారసులకు లైన్ క్లియర్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.

YCP to field Chevireddy Mohit Reddy as Party candidate for next elections from Chandragiri

చెవిరెడ్డి కుమారుడికి సీటు : తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్దిగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ ను ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి తిరుపతి వేదికగా ప్రకటన చేసారు. ముఖ్యమంత్రితో భూమన తన కుమారుడి అభ్యర్ధిత్వం గురించి గతంలోనే ప్రస్తావన చేసారు. సర్వేల ఆధారంగా అభినయ్ పేరును ఖరారు చేసారు. అదే విధంగా చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో అభ్యర్దిగా ఖరారు చేసారు.గతంలోనే పార్టీ నుంచి ఈ మేరకు సంకేతాలు అందాయి. ఇప్పుడు ఎన్నికల సంసిద్దత సమావేశాల వేళ పార్టీ అధికారికంగా చంద్రగిరి అభ్యర్దిని ప్రకటించింది. ఎమ్మెల్యే చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి క్రియాశీలకంగా మారారు. మోహిత్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి రూరల్ ఎంపీపీ గా కొనసాగుతున్నారు.

గెలుపే ప్రామాణికంగా : చంద్రగిరి నుంచి 2014,2019 ఎన్నికల్లో వరుసగా చెవిరెడ్డి భాస్కర రెడ్డి వైసీపీ నుంచి గెలుపొందారు.2014 లో టీడీపీ నుంచి గల్లా అరుణ, 2019 లో టీడీపీ అభ్యర్దిగా పులివర్తి నాని పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి ప్రతీ సీటు అటు టీడీపీ, ఇటు వైసీపీకి కీలకంగా మారాయి. చంద్రబాబు స్వగ్రామం ఉన్న నియోజకవర్గం కావటంతో ఇక్కడ గెలుపును రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.ఈ సమయంలో చెవిరెడ్డి కుమారుడికి సీటు ఖరారు చేసారు. మోహిత్ రెడ్డి అభ్యర్ధిత్వం ఖరారు చేయటం పైన టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి చంద్రగిరిలో గెలుపుకు అందరూ కలిసి కట్టుగా పని చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. దీంతో, మిగిలిన నేతల వారసుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+