వైసిపికి 120 పైగా సీట్లు : తలసాని సంచలనం : టిడిపికి చేతికి మరో అస్త్రం..!
Recommended Video

హోరా హోరీగా మారిన ఏపి ఎన్నకల్లో వైసిపి 120 సీట్లకు పైగా గెలుస్తుందని తెలంగాణ మంత్రి తలసాని జోస్యం చెప్పా రు. ఇది వైసిపి నేతల్లో జోష్ నింపుతోంది. ఇదే సమయంలో టిడిపి చేతికి మరో అస్త్రం దొరికింది. ఇప్పటికే కేసీఆర్ - వైసిపి ఒకటే అంటూ టిడిపి అధినేత ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో వైసిపికి అనుకూలంగా తెలంగాణ మంత్రులు మా ట్లాడుతున్న తీరు పై టిడిపి మరింతగా విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది.
వైసిపి గెలుస్తోంది..
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణ ఎన్నికల సమయం నాటి నుండి టిడిపి...చంద్రబాబు లక్ష్యం గా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏపి పర్యటనకు వచ్చిన సమయంలోనూ చంద్రబాబుక వ్యతిరేకంగా మాట్లాడారు. దీని పై చంద్రబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక, ఎన్నికల ప్రచారం సమయంలోనూ టిడిపి అధి నేత చంద్రబాబు జగన్-కేసీఆర్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో..ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 120 నుంచి 130 సీట్లు గెలవబోతోందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. అదేవిధంగా 22 నుంచి 23 ఎంపీ సీట్లు ఆ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. టీడీపీ అరాచక పాలనపై ఏపీ ప్రజలు విసుగెత్తిపోయారని అందుకే మార్పురావాలని కోరుకుంటున్నారన్నారు.

టిడిపికి అస్త్రంగా..
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నా రు. చంద్రబాబుతో సహా ఎంత మంది వచ్చినా ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారన్నారు.ఇప్పటికే ఎన్నికల ప్రచారం తో వేడి పుట్టిస్తున్న చంద్రబాబు ఇప్పుడు తలసాని వ్యాఖ్యల ద్వారా ఆ పార్టీకి..వైసిపి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో అర్దం అయిందా అంటూ మరితంగా తన విమర్శలకు పదును పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జాతీయ ఛానళ్ల సర్వేలను జగన్ మైండ్ గేమ్ గా ప్రచారం చేస్తున్న టిడిపి..ఇప్పుడు తలసాని వ్యాఖ్యలపైనా..జగన్ విజయం సాధిస్తాడనే సర్వేలను లక్ష్యంగా చేసుకోనుంది. ఇప్పుడు తలసాని వ్యాఖ్యలు ఏపిలో రాజకీయంగా కొత్త సవాళ్లకు కారణమవుతున్నాయి.












Click it and Unblock the Notifications