Year ender 2024: ఏపీ ఎన్నికల్లో పేలిన స్లోగన్స్ ఇవే.. ఎవరి నినాదం ఏంటంటే ?
ఈ ఏడాది ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ అధినేతలు, నాయకులు పలు నినాదాల్ని తెరపైకి తెచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా స్లోగన్స్ జనంలోకి బాగా వెళ్లాయి కూడా. వైసీపీ వర్సెస్ కూటమిగా సాగిన ఈ ఎన్నికల్లో జనం చివరికి కూటిమినే ఆదరించినా వైసీపీ పేల్చిన పలు స్లోగన్స్ కూడా జనంలోకి వెళ్లాయి. అవేంటో ఓసారి చూద్దాం..
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో అత్యంత బలంగా కనిపించిన వైసీపీకి షాకిచ్చి కూటమిని అందలం ఎక్కించాయి. దీనికి కేంద్రంగా మారిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం వైఎస్ జగన్ తో పాటు విపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జనాల్ని ఆకట్టుకునేందుకు పలు నినాదాల్ని తెరపైకి తెచ్చారు. అంతే కాదు ప్రతీ చోటా ప్రచారంలో వాటినే తిప్పితిప్పి వాడారు. దీంతో జనం కూడా వాటిని ఆదరించినట్లే కనిపించారు.

ఎన్నికలకు ముందు టాప్ ట్రెండింగ్ లో ఉన్న స్లోగన్ "సిద్ధం". అంతకు ముందు ఎన్నికల్లో భారీ విజయాన్ని రిపీట్ చేయడానికి సిద్దం అంటూ జగన్ జనంలోకి దూసుకెళ్లారు. సిద్దం పేరుతో భారీ సభలు నిర్వహించారు. వీటికి జనం స్పందన కూడా భారీగా కనిపించింది. దీంతో జగన్‌తో పాటు వైసీపీ నాయకులు సైతం ప్రచారంలో ప్రతి చోటా ఎన్నికలకు మేము సిద్ధం, బ్యాలెట్ బటన్ నొక్కడానికి మీరు సిద్ధమా..? ఒక్కడిని ఎదుర్కొనేందుకు గుంపులు గుంపులుగా వస్తున్న కూటమి పార్టీల నాయకుల్ని ఓడించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమా..? అంటూ దీన్ని విస్తృతంగా వాడారు.
దీనికి కౌంటర్ గా కూటమి పార్టీలు కూడా.. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన సైకో జగన్ ఓడిపోవడానికి సిద్ధమా..? వైసీపీ ప్రతిపక్షానికి సిద్ధమా..? అవినీతి, అక్రమాలకు పాల్పడిన వైసీపీ నాయకులు జైలుకు వెళ్ళడానికి సిద్ధమా..? అంటూ కౌంటర్లు వేశారు. అలాగే చంద్రబాబు డైలాగ్ కడుపు మండదా అండీని అందిపుచ్చుకుని జగన్.. వైసీపీ ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. కడుపు కడుపు మండదా అక్కా..? మండదా చెల్లి..? మండదా తమ్ముడు..? అంటూ జనాన్ని ప్రశ్నించారు.
దీనికీ కూటమి నుంచి కౌంటర్లు బాగానే పడ్డాయి. ఆంధ్రాకి రాజధాని లేకపోతే మండదా అన్నా..? రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్నవి కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంటే మండదా తమ్ముడూ..? పేదోడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను రద్దు చేస్తే వాళ్ళకు మండదా జగనా..? అంటూ వైసీపీని ట్రోల్ చేశారు. అలాగే బాబును నమ్మితే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గోవిందా, వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు గోవిందా, నవరత్నాలు లేకుంటే సామాన్యుల ఉనికి గోవిందా, అంటూ గోవిందా అనే స్లోగన్‌ను జగన్ తెరపైకి తెచ్చారు.
అటు చంద్రబాబు కూడా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ స్లోగన్‌తో మొదలుపెట్టి.. రా.. కదలి రా, సిద్ధం..సంసిద్ధం, హూ కిల్డ్ బాబాయ్, కోడికత్తి పోయి గులకరాయి వచ్చే వంటి నినాదాల్ని తెరపైకి తెచ్చారు.ఇవన్నీ జనంలోకి బాగా వెళ్ళాయి. అలాగే జనసేనాని పవన్ తన ప్రచారంలో వైసీపీ సిద్ధం స్లోగన్ కు కౌంటర్ గామేము సిద్ధమే- మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ కౌంటర్ ఇచ్చి ప్రచారం మొదలుపెట్టారు. ఆ తర్వాత హలో ఏపీ- బైబై వైసీపీ అంటూ మరో స్లోగన్ ను తెచ్చి విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లారు. ఇలా ప్రతీ స్లోగన్ కూడా ఏపీ ఎన్నికల్లో పేలింది. అయితే చివరకు కూటమినే విజయం వరించింది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications