మోదీ రూల్ లో పవన్ కీ రోల్ - గేమ్ ఛేంజర్..!!

మరో వారంలో 2024 సంవత్సరం ముగియనుంది. కానీ, 2024 కేంద్రంలో మోదీ మూడో సారి ప్రధాని అయ్యారు. అందులో ఏపీ కీలక భూమిక పోషించింది. ఎన్డీఏకు ఏపీ నుంచి 21 లోక్ సభ స్థానాలు దక్కాయి. ఏపీలో 164 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. ఈ గెలుపు వెనుక పవన్ కారణ మంటూ మోదీ పార్లమెంట్ వేదికగా చెప్పారు. ఈ ఫలితాలతో పవన్ పైన నమ్మకం పెరిగిన మోదీ వచ్చే ఎన్నికల కోసం పవన్ ను దక్షిణాది రాష్ట్రాల పై అస్త్రంగా ప్రయోగించేందుకు సిద్దమయ్యారు.

మోదీ ప్రశంసలు
యే పవన్ నహీ ఆంధీ హై. కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్డీఏ పక్ష నేత గా ఎన్నిక కోసం జరిగిన సమావేశంలో అందరి సమక్షంలో పవన్ ను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటానికి.. అసలు మూడు పార్టీలు జత కట్టటానికి పవన్ కారణం. ప్రచారంలోనూ పవన్ తన మార్క్ దూకుడు ప్రదర్శించారు. అటు మోదీ, ఇటు చంద్రబాబు పైన గౌరవం చూపిస్తూనే.. జగన్ ఓటమిలో కీలక పాత్ర పోషించారు. సీట్ల విషయంలోనూ రాజీ పడి.. తాను తగ్గి.. కూటమిని నెగ్గేలా చేసారు.

Year Ender 2024 year 2024 has turned out to be monumental for PM Modi

పవన్ కు ప్రాధాన్యత
పోటీ చేసిన రెండు లోక్ సభ... 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించారు. కేంద్ర మంత్రివర్గం లో స్థానం కూడా కోరలేదు. అదే విధంగా తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లోనూ తన అన్నకు సీటు రాకపోయినా వేచి చూసే ధోరణితోనే ఉన్నారు. మోదీ మూడో సారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పవన్ కు ప్రత్యేక గౌరవం అందుతోంది. తాజా ఢిల్లీ పర్యటనలోనూ పవన్ కు కేంద్ర మంత్రులు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. కోరిన విధంగా నిర్ణయాలు అమలు చేసారు. ఇక, బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పవన్ ప్రచారం చేసారు. అక్కడ పవన్ కు వచ్చిన స్పందన బీజేపీ నాయకత్వాన్ని ఆకర్షించింది.

గేమ్ ఛేంజర్
2024 ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మధ్యప్రదేశ్‌లో మాత్రం బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మరికొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు కనిపించాయి. తెలంగాణ లో బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందింది. ఇక, జమ్మూ కాశ్మీర్ .. జార్ఖండ్ లో ఓడిన బీజేపీ ఈ ఏడాది లోనే హర్యానా, మహారాష్ట్రలో తిరిగి విజయం సాధించింది. బీజేపీ నాయకత్వానికి ఈ ఫలితాలు జోష్ పెంచాయి. ఈ ఫలితాలతో జమిలి దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. జమిలి బిల్లును సభలో ప్రవేశ పెట్టిన కేంద్రం.. ఆ బిల్లులను జేపీసీకి సిఫార్సు చేసింది. ఇక.. 2025 తొలి రెండు నెలల్లో జరిగే ఢిల్లీ, బీహార్ ఎన్నికలు బీజేపీ నాయకత్వ సమర్థతకు పరీక్షగా నిలవనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+