• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అవును.. వాళ్లిద్ద‌రూ నిజంగా విడిపోయారు..

|

చాలా రోజుల త‌ర్వాత ఏపి సీఎం చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒకే వేదిక పై క‌లుసుకున్నారు. ఒకే కార్య‌క్ర‌మానికి ఇద్ద‌రూ హాజ‌రైన‌ప్ప‌టికి ఒక‌రికి ఒక‌రు అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించారు. 2014సాదార‌ణ ఎన్నిక‌ల్లో ఇద్ద‌రూ అత్యంత స‌న్నిహితులుగా మెలిగిన బాబు - ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాలుగేళ్లు తిరిగే స‌రికి ఒక‌రిని ఒక‌రు ప‌ల‌క‌రించుకోలేనంత శ‌త్రువులుగా మారిపోయారు. రాజ‌కీయాలు ఎంత‌టి స్నేహితుల‌నైన విడ‌దీస్తాయి., ఎంత‌టి శ‌త్రువుల‌నైనా క‌లుపుతాయ‌న‌డానికి చంద్ర‌బాబు ప‌వ‌న్ ల ఉందంత‌మే ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు.

అప్పుడు ఆక‌ర్ష‌ణ‌..ఇప్పుడు విక‌ర్ష‌ణ‌..

అప్పుడు ఆక‌ర్ష‌ణ‌..ఇప్పుడు విక‌ర్ష‌ణ‌..

నిన్నటి వరకు వారిద్దరూ అత్యంత స‌న్నిహితులు! ఎన్నికల్లో సహకరించుకున్నారు. ఒకరిని ఒకరు గౌరవించుకున్నారు. అనుకోకుండా ఒకరోజు సీన్ రివర్స్ అయింది. 24 గంటల్లో దృశ్యం మారిపోయింది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే స్థాయికి వెళ్లింది. వాళ్లిద్దరు మరెవరో కాదు. ఒకరు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాగా, మరొకరు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వీరిద్దరి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఏర్పడ్డాయో మరోసారి రుజువైంది.

  పింక్ డైమండ్ పై చంద్రబాబు ను ప్రశ్నించిన పవన్
  ఓకేచోట పవన్ కళ్యాణ్, చంద్రబాబు

  ఓకేచోట పవన్ కళ్యాణ్, చంద్రబాబు

  ఎంతటి రాజకీయ ప్రత్యర్థులైనా ఎదురు పడినప్పుడు ఒకరికి ఒకరు ఓ చిరు నవ్వో, ఓ చిన్న పలకరింపో సహజం. గుంటూరు జిల్లాలో దశవతార వెంకటేశ్వర స్వామి ధ్వజస్థంభారోహణ కార్యక్రమానికి ఈ ఇద్దరు నేతలు హాజరయ్యారు. ఇద్దరు కాస్త అటు ఇటుగా ఒకే సమయంలో ఆలయ ప్రాంగణానికి వచ్చారు. ఇద్దరు ఒకేసారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇద్దరు కొన్ని నిముషాల సేపు పక్కపక్కనే ఉన్నారు.

   ప‌వ‌న్ క‌ళ్యాన్ ను హీరోగా అభివ‌ర్ణించిన టీడిపి ఇప్పుడు విల‌న్ గా చిత్రీక‌రిస్తోంది.

  ప‌వ‌న్ క‌ళ్యాన్ ను హీరోగా అభివ‌ర్ణించిన టీడిపి ఇప్పుడు విల‌న్ గా చిత్రీక‌రిస్తోంది.

  ఇంతకీ వీరిద్దరు ఆ స్థాయిలో విభేదించుకోవడానికి కారణం ఏమిటన్న చర్చ మొదలైంది. అయితే, దీనికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయే. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకరి పై ఒకరు రాజకీయ ప్రత్యర్థి స్థాయి నుంచి బద్ధ విరోదుల స్థాయికి వెళ్లిపోయారు. తనతో విబేధించాలని భావించిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత వ్యవహరించిన తీరును చంద్రబాబు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. రాజకీయల్లో పార్టీ నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అధికార పార్టీ పై ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు సహజమే. కాకపోతే... పవన్ కల్యాణ్ పరిధి దాటి తనపైనా, తన కుటుంబం పైనా దాడి చేశారన్న భావన చంద్రబాబులో ఉన్నట్టు చెబుతున్నారు.

  బాబును రాజ‌నీతిజ్ఞుడు గా పొగిడిన ప‌వ‌న్ అంత‌లోనే అవినీతి ప‌రుడని విమ‌ర్శ‌..

  బాబును రాజ‌నీతిజ్ఞుడు గా పొగిడిన ప‌వ‌న్ అంత‌లోనే అవినీతి ప‌రుడని విమ‌ర్శ‌..

  ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో అభ్యంతరం లేదు కానీ, వ్యక్తిగత విమర్శల స్థాయికి వెళ్లిపోవడం పై బాబు బాగా సీరియస్ గా ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తాను, తన కుమారుడు లోకేష్ అవినీతి పరులమంటూ రాత్రికి రాత్రే పవన్ కల్యాణ్ టోన్ మార్చి దాడి చేయడాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో పవన్ సైతం చంద్రబాబు పై పాలనాపరమైన వ్యవహారాల కంటే వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయ విమర్శగా కాక... కసిగా టార్గెట్ చేసి విమర్శిస్తున్నట్టుగా ఆయన బాడీలాంగ్వేజ్ అనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వారిద్దరు రాజకీయ ప్రత్యర్థులు అనేకంటే... వ్యక్తిగత ప్రత్యర్థుల స్థాయికి వెళ్లిపోయారని అనిపిస్తోంది. ఈ కారణంగానే దేవ దేవుడి సన్నిధిలో సైతం ఇరువురి మధ్య మాటల్లేవ్ అన్నది అర్థమవుతోంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  lok-sabha-home

  English summary
  ap cm chandrababu and pawan kalyan met in one dais. they met in guntur district nambur village temple inageration program. babu and pavan not even talk a single ward each other.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more