Kondaveedu Express: కొండవీడు ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ మార్పు-కొత్త వేళలివే..!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో యశ్వంత్ పూర్ నుంచి మచిలీపట్నానికి ప్రయాణించే కొండవీడు ఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పు జరిగింది. వివిధ కారణాలతో ఇలా కొండవీడు ఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పు చేసినట్లు తెలుస్తోంది. సవరించిన సమయాలను దక్షిణ మధ్య రైల్వే ఇవాళ విడుదల చేసింది. ఇప్పటివరకూ కొండవీడు ఎక్స్ ప్రెస్ మధ్యాహ్నం 1.15కు యశ్వంత్ పూర్ లో బయలుదేరుతుండగా.. దాన్ని ఇప్పుడు ముందుకు జరిపి 12.45కు బయలుదేరేలా మార్చారు.
సవరించిన షెడ్యూల్ ప్రకారం యశ్వంత్ పూర్ లో మధ్యాహ్నం 12.45కు బయలుదేరనున్న కొండవీడు ఎక్స్ ప్రెస్.. 1.05కు యలహంక, 2.10కి హిందూపూర్, 2.40కి పెనుకొండ, 3.01కి సత్యసాయి ప్రశాంతి నిలయం, 3.55కు ధర్మవరం, 4.33కు అనంతపురం, 5.28కి గుత్తి, సాయంత్రం 6.28కి డోన్, 7.03కు బేతచర్ల, 8.20కి నంద్యాల, 8.59కి గిద్దలూరుకు రానుంది. రాత్రి 9.29కి కంభం, 9.59కి మార్కాపూర్ రోడ్డు, 10.24కు దొనకొండ, అర్ధరాత్రి 12.24కు నరసరావుపేటలో ఆగనుంది.

ఆ తర్వాత గుంటూరుకు అర్ధరాత్రి 1 గంటకు, తెల్లవారుజామున 2.50కు విజయవాడకు, 3.48కి విజయవాడకు, 5.15కు మచిలీపట్నానికి చేరుకుంటుంది. దీంతో కొండవీడు ఎక్స్ ప్రెస్ ప్రయాణం ముగియనుంది. అయితే ఈ టైం టైబుల్ కొత్త ఏడాదిలో జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో జనవరి నుంచి ప్రయాణాలు చేసే వారు ఈ కొత్త షెడ్యూల్ ను బట్టి తమ గమ్య స్ధానాలకు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications