నేను చనిపోతే బయటివారు కూడా బాధపడాలి: జూనియర్ ఎన్టీఆర్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా సినిమా రాబోతోంది. మూడు సంవత్సరాల క్రితం రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ లో నటించాడు. దానికి ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత చేశాడు. ఇతర హీరోలతో పోలిస్తే ప్రాజెక్టులు ఆలస్యగా నడుస్తుండటంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరు సంవత్సరాలకు ఒకసారి సినిమాచేసే బదులు ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చుకదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
రెండుసార్లు వెనకపడ్డాడు
ప్రస్తుతం దేవర చిత్రం పూర్తయింది. విడుదలైన అన్ని పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇది పాన్ ఇండియా సినిమానే. ఈనెల 27వ తేదీన విడుదల కాబోతోంది. దీనితర్వాత హృతిక్ రోషన్ దర్శకత్వంలో నటిస్తున్న మరో చిత్రం వార్2 వచ్చే ఏడాది విడుదలవుతుంది. ఇది కూడా మల్టీస్టారర్ సినిమానే. సోలో హీరోగా దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు. ప్రస్తుతం ఇన్ని సినిమాలను వరుసగా చేసుకుంటూ వస్తోన్న తారక్ సింహాద్రి తర్వాత ఒకసారి, యమదొంగ సినిమా తర్వాత మరోసారి కెరీర్ లో వెనకపడ్డారు. ఎన్ని ఫ్లాపులు పడినప్పటికీ ఇబ్బంది ఎదురుకాలేదు.

తాను నమ్మే సిద్ధాంతమే టెంపర్
రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాలు రెండూ డిజాస్టర్లు అయ్యాయి. ఆ సమయంలో టెంపర్ ఎంచుకున్నారు. దీనికి కథ వక్కంతం వంశీ. తేడా కొడితే హ్యాట్రిక్ ఫ్లాపులు పడతాయని, రిస్క్ చేస్తున్నామని అనిపించడంలేదా అని వంశీ అడిగారు. ఈ సినిమా కథ విన్నప్పుడు తనకు పాజిటివ్ షేడ్, గ్రే షేడ్ రెండూ కనిపించలేదని, ఒక మంచివాడు చెడ్డవాడిగా మారితే చెడ్డవాడిగానే చనిపోతాడని, అదే చెడ్డవాడు మంచివాడుగా మారితే మంచివాడుగా చనిపోతాడని, దేవుడిగా మిగిలిపోతాడని, ఇదే తాను నమ్మే సిద్ధాంతమని తారక్ చెప్పారు. తాను చనిపోతే తన కుటుంబ సభ్యులతోపాటు బయటవారు కూడా ఎంతోకొంత మంది బాధపడాలని, అదే తాను ఒక మనిషిగా సంపాదించుకోగలిగిందని అని ఎన్టీఆర్ చెప్పారు. తాను నమ్మే సిద్ధాంతానికి దగ్గరగా ఉన్న చిత్రమే టెంపర్ అని ఎన్టీఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications