జైల్లో ఉన్న నువ్వు కూడా నీతులు చెప్పేవాడివే.. నీతో చెప్పించుకోవటం నా ఖర్మ అన్న దేవినేని ఉమా
వైసీపీ నేత , రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమా పై చేసిన వ్యాఖ్యలపై ఉమా స్పందించారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డివ్యాఖ్యలపై ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, దేవినేని ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు . ఇవాళ వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్లు కొడుతున్నాడు. అక్రమాస్తుల కేసులో ఆయన ఏ2 ముద్దాయి అని పేర్కొన్న దేవినేని నా ఖర్మ అయ్యా. నీతో నీతులు చెప్పించుకోవాల్సిన ఖర్మ పట్టింది నాకు అంటూఅసహనం వ్యక్తం చేశారు.
Recommended Video


16 నెలలు జైలులో ఉన్న నీతో చెప్పించుకునే ఖర్మ నాకు పట్టింది అంటూ అసహనం వ్యక్తం చేసిన దేవినేని
నువ్వు బినామీ బ్రీఫ్ కేసు కంపెనీలు పెట్టి ఏ2 ముద్దాయిగా 16 నెలలు జైలులో ఉన్నావంటూ పేర్కొన్నారు దేవినేని . ఇక ఇవాళ కాలం కలిసి వచ్చింది కాబట్టి నువ్వు ఈరోజు ఢిల్లీలో ఓ కేబినెట్ హోదాను వెలగబెడుతున్నావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు . ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నావ్. నన్ను దొంగ అంటున్నావ్. నువ్వు చెప్పే దొంగ కేసుల్లో నేను ఇంకా దొంగను కాలేదు విజయసాయిరెడ్డీ. పిచ్చి మాటలు మానేయ్. మంచిగా ఉండు' అని హితవు పలికారు. ఇక జైలుకు వెళ్ళొచ్చిన నీతో కూడా నీతులు చెప్పించుకునే ఖర్మ పట్టింది నాకు అంటూ ఆయన విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

పోలవరం 70 శాతం పనులు పూర్తి చేసింది మేమే అన్న దేవినేని ఉమా
ఇక అంతే కాదు ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పునాదులు కూడా లేవలేదని ఏపీ సీఎం జగన్ గతంలో విమర్శలు గుప్పించారు , కానీ తమ హయాంలో పోలవరం ప్రాజెక్టులో 70 శాతం పనులు పూర్తి అయ్యాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేవలం కాలువల్లో మట్టిని తీసి చేతులు దులుపుకున్నారని ఆయన పేర్కొన్నారు . ఈ విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే రాజశేఖరరెడ్డి ఆత్మ అయిన కేవీపీ రామచంద్రరావు ను అడగాలనీ, ఆయన ఢిల్లీలో ఉంటాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

దేవినేని ఉమాపై విజయసాయి ట్వీట్ లు ... స్పందించిన దేవినేని
ఇక తాజాగా దేవినేనిపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ లు తెలిసిందే. పోలవరం పాజెక్ట్ అంచనాలను ఎలా తగ్గిస్తారో చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యల పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు . ఉమ వ్యాఖ్యలు వింటుంటే, దొంగే తనను పట్టుకోవాలని పోలీసులకు సవాల్ విసిరినట్టుందని ఎద్దేవా చేశారు.పోలవరం పనుల అంచనాలను ఎలా తగ్గిస్తారో చెప్పాలని మాజీ మంత్రి ఉమా అనడం, దమ్ముంటే తనను పట్టుకోమని దొంగ పోలీసులకు సవాలు విసిరినట్టుగా ఉందన్నారు విజయసాయి . పోలవరం పనులు మొదలైనప్పటీ నుంచి ప్రాజెక్టును ఐదేళ్ళు ఏటీఎంలాగా వాడుకున్నారని ఆయన ఆరోపించారు. మీ దోపిడీలన్నీ బయటకొస్తాయి. ఎవరూ తప్పించుకోలేరు ఉమాఅని హెచ్చరించారు. ఇక ఈ వ్యాఖ్యల నేపధ్యంలోనే దేవినేని ఉమా మీడియా సమావేశం పెట్టి మరీ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications