"ఈసారి జగన్ 2.0 గ్యారంటీ"- తర్వాత 30 ఏళ్లు మనమేనన్న మాజీ సీఎం..!
ఏపీలో అధికారం కోల్పోయాక వరుస ఎదురుదెబ్బలు తింటున్న నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ క్యాడర్ లో జోష్ నింపేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా విజయవాడ నగరానికి చెందిన కార్పోరేటర్లు, ఇతర నేతలతో భేటీ అయిన జగన్.. కీలక వ్యాఖ్యలు చేసారు. ఇకపై జగన్ 2.0ను చూస్తారంటూ వారికి హామీ ఇచ్చారు. తాజాగా విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన జగన్ .. పార్టీ నేతల్లో స్తబ్దతను తొలగించే ప్రయత్నం చేశారు.

ఇవాళ తాడేపల్లి నివాసంలో విజయవాడకు చెందిన కార్పోరేటర్లు, పార్టీ ఇన్ చార్జ్ లతో భేటీ అయిన వైఎస్ జగన్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై స్పందించారు. చంద్రబాబు మిమల్ని పెడుతున్న బాధల్ని, కష్టాల్ని చూశానని, ఇబ్బందులు పెట్టిన వారిని ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబడతా అంటూ జగన్ హెచ్చరికలు చేశారు. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తానని తెలిపారు.
మరోవైపు ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారని మాజీ సీఎం వెల్లడించారు. ఈ 2.0 వేరేగా ఉంటుందన్నారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానన్నారు. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డానని, వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానని జగన్ అంగీకరించారు. ఈసారి మాత్రం అలా ఉండదని నేతలకు జగన్ హామీ ఇచ్చారు. గతంలో ఎన్నికల్లో ఇచ్చిన 99 శాతం హామీలు అమలు చేశామని, కోవిడ్ ప్రభావం పడినా దాన్ని ఎదుర్కొని క్యాలెండర్ ఇచ్చి మరీ సంక్షేమ పథకాలు అందించామని గుర్తుచేశారు. వైసీపీ మాత్రమే గతంలో అన్ని కార్పోరేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్ని క్లీన్ స్వీప్ చేయగలిగిందన్నారు.
ఇప్పుడు ఎన్నికలు పూర్తయి 9 నెలలవుతోందని, ఓడినా ప్రజల దగ్గరకు తలెత్తుకుని వెళ్లే పరిస్ధితి వైసీపీకి ఉందని జగన్ తెలిపారు. వాళ్ల చిరునవ్వుల మధ్య నిలబడి సమస్యలు వినగలుగుతామన్నారు. వాళ్లతో మమేకం కాగలుగుతామన్నారు. దీనికి కారణం వారిని తాము ఎప్పుడూ మోసం చేయలేదన్నారు. వాళ్లకు ఏరోజూ అబద్దాలు చెప్పలేదన్నారు. కానీ కూటమి నాయకులకు ఆ పరిస్ధితి లేదన్నారు. దానికి కారణం ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా పక్కనబెట్టేయడమే అన్నారు.












Click it and Unblock the Notifications