ఉన్నత చదువులు: 20 ఏళ్లకే ఎన్నికల్లో గెలిచిన గర్ల్స్
హైదరాబాద్: ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో యువత కూడా సత్తా చాటింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో సత్తా చాటడం గమనార్హం. బద్వేలు జెడ్పీటీసీగా టిడిపి తరఫున పోటీ చేసిన చార్టర్డ్ అకౌంటెండ్ (సిఏ) విద్యార్థిని శిరీష.. 317 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
గోపవరం మండలం కాలువలల్లె నుంచి ఎంపీటీసీగా బరిలో నిలిచిన టిడిపి అభ్యర్థిని శిరీష కుమారి... 170 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వీరిద్దరు వయస్సు అటు ఇటు ఇరవయ్యే.
తమ గెలుపు పైన ఉత్సాహంతో ఉన్న వారు మాట్లాడుతూ... యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ వయస్సులో ఉన్నప్పుడు వస్తేనే ప్రజలకు ఏదైనా చేయగల్గుతామన్నారు. తమను గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని తెలిపారు.

కాగా, తూర్పు గోదావరి జిల్లా కడియం మండల కేంద్రం నుంచి జిల్లా ప్రాదేశిక సభ్యురాలు (జడ్‌పీటీసీ)గా బీటెక్ విద్యార్థిని పాలపర్తి రోజా విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో నిలిచిన రోజా చిన్న వయసులోనే జడ్‌పీటీసీగా గెలిచి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమె వయసు 22 సంవత్సరాలు మాత్రమే.
పైగా, తన ప్రత్యర్థి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిని ఉల్లింకల విజయలక్ష్మిపై 14,247 ఓట్ల మెజారిటీ సాధించారు. విద్యావంతురాలిగా మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచీ ఆమె చేస్తూ వచ్చారు. దీంతో 14 గ్రామాల ప్రజలు రోజాకు జడ్పిటీసి హోదా కట్టబెట్టారు. యువత రాజకీయాల్లోకి రావాలనే నినాదంతో తాను ఎన్నికల్లో పోటీ చేశానంటున్న రోజా తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పాలనతోనే స్వర్ణాంధ్ర సాధ్యమని వివరించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications