ఏపీకి 'హోదా' కోసం మరో బలిదానం: ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే కోలుకుంటుందని, ఈ మేరకు కేంద్రం తక్షణమే ప్రత్యేక హోదాను ప్రకటించాలని ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ఉంగటూరు మండలం చేబ్రోలుకు చెందిన సుందరపు దుర్గాప్రసాద్(49) ఆగస్టు 25వ తేదీన కైకరం జాతీయ రహదారిపై ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ప్రత్యేకహోదా కల్పిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్ర విభజనతో తన కుమార్తెకు ఉద్యోగం రాలేదని మనస్తాపం చెంది అత్మహత్యయత్నం చేశాడు.

డీఎస్సీ పరీక్షా ఫలితాల్లో తన చిన్న కూతురు 6వ తరగతి నుంచి హైదరాబాద్‌లో చదవడంతో నాన్ లోకల్ అంటూ రిజల్ట్‌ను విత్‌హెల్డ్‌లో పెట్టడం జరిగిందని, దీనికంతటికి రాష్ట్ర విభజనే కారణమని మనస్తాపం చెంది అత్మహత్యయత్నం చేశాడు. అప్పటినుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు, విజయవాడ, హైదరాబాదు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నాడు.
మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం దుర్గాప్రసాద్ కన్నుమూశాడు. ఆయనకు భార్య జ్యోతి, కూతుళ్లు శ్రావణి, నిఖిల ఉన్నారు. దుర్గాప్రసాద్ మరణించడంతో ఏలూరులో విషాదఛాయలు అలముకున్నాయి.
దుర్గాప్రసాద్‌ది ఆత్మహత్య కాదని, ఇది ప్రభుత్వం చేసిన హత్యేనని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications