యవతకు TTD అరుదైన ఆఫర్, ఇలా చేస్తే కుటుంబంతో సహా వెంటనే బ్రేక్ దర్శనం..!!
Tirumala: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. టీటీడీ బోర్డు రేపు(మంగళవారం) అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం పది రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. టికెట్ల జారీ విధానం పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమయంలో టీటీడీ అందిస్తున్న అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుంటోంది. దీని ద్వారా కుటుంబ సభ్యులతో శ్రీవారి బ్రేక్ దర్శనానికి అవకాశం దక్కుతోంది.
యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సనాతన ధర్మంపై అనురక్తిని కల్పించడమే లక్ష్యంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రామకోటి తరహాలో గోవింద కోటిని ప్రవేశపెట్టింది. గోవింద కోటి రాసిన యువతకు వీఐపీ దర్శనాన్ని కల్పిస్తోంది. 25 సంవత్సరాలు, లేదా అంతకంటే తక్కువ వయసున్న వారు ఇందుకు అర్హులు. 10,01,116 సార్లు రాస్తే రాసిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. కోటిసార్లు నామాలు రాస్తే వారితోపాటు కుటుంబ సభ్యులందరూ వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. తితిదే సమాచార కేంద్రాలు, పుస్తక విక్రయ కేంద్రాలు, ఆన్‌లైన్‌లో గోవిందకోటి నామాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 200 పేజీలుండే పుస్తకంలో 39,600 నామాలు రాయొచ్చు. 10,01,116 నామాలు పూర్తి చేయడానికి దాదాపు 26 పుస్తకాలు అవసరం అవుతాయని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

కోటి నామాల పుస్తకాలను రాయడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుందని టిటిడి సిబ్బంది చెబుతున్నారు. గోవిందకోటి నామాల పుస్తకాన్ని పూర్తిచేసి తిరుమలలోని తితిదే పేష్కార్ ఆఫీసు లో అందిస్తే వారికి మరుసటి రోజు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఇదే కోటాలో పది లక్షల సార్లు గోవింద నామాలు రాసిన మహిళకు తొలి గడప నుంచి తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం లభించింది. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన నూతి పూజ(24) హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగిని. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం విధానంలో ఆమె ఇంటినుంచే పనిచేస్తున్నారు. అమెరికా ప్రాజెక్టు కావడంతో అర్ధరాత్రి వరకూ కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయాల్సి వచ్చేది. ఓవైపు కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగ ఒత్తిళ్లతో ఆమె మానసికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనేవారు. ఈ క్రమంలో టీటీడీ ప్రకటించిన 'గోవింద కోటి' కార్యక్రమం గురించి తెలియడంతో శ్రీవారి భక్తురాలైన పూజ తాను కూడా స్వామివారి నామాలు రాయాలని భావించారు.
కాగా, తొలుత లక్ష నామాలు రాయాలనుకున్నా అందులో లభిస్తున్న ఆనందంతో దాన్ని కొనసాగించి ఇటీవల పది లక్షల నామాలు పూర్తి చేశారు. మొత్తం 10,01,116 సార్ల్లు గోవింద నామాలు రాసిన ఆమెకు టీటీడీ ఈ నెల 14న ప్రత్యేకంగా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. భర్త అభిషేక్‌తో పాటు తిరుమల వచ్చిన పూజ తొలి గడప నుంచి శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు ఆఫ్‌లైన్ ద్వారా లక్కీడిప్ లోనూ కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. గోవింద నామాలు రాయడం మొదలుపెట్టిన తర్వాత పని ఒత్తిడిని అధిగమించగలిగానని, తనలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు చాలా ప్రశాంతత లభించిందని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో తొలి గడప నుంచే ఆయన్ను దర్శించుకొనే అదృష్టం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇక.. ఇదే తరహాలో మరి కొంత మంది యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ముందుకొస్తున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications