రైలు కింద పడి ప్రియుడి ఆత్మహత్య: విషగుళికలు మింగిన ప్రేయసి

జనగామ పట్టణంలోని గుండ్లగడ్డకు చెందిన ఎల్లస్వామి, లలిత దంపతుల కుమారుడు మామిడిపల్లి సాగర్ (25) స్థానిక కళాశాలలో బిటెక్ పూర్తి చేశాడు. సాగర్‌తో పాటు బిటెక్ పూర్తి చేసిన ధర్మకంచకు చెందిన ఓ యువతితో ఏర్పడిన అతని పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి వరకు వచ్చింది.
మంగళవారంనాడు ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చితార్థం విషయమై మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో తలెత్తిన విభేదాల కారణంగా సాగర్ జనగామ - యశ్వంత్‌పూర్ మధ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
మృతుడు సాగర్ వద్ద పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. పెళ్లి ఇష్టం లేకనే సాగర్ ఆత్మహత్య చేసుకున్నాడని సాగర్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతని ఆత్మహత్య విషయం తెలుసుకున్న ప్రియురాలు విషగుళికలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications