మరో పెళ్లి చేసుకున్న ప్రేయసితో లింక్ పెట్టుకున్నాడు, హత్యకు గురయ్యాడు
హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో ఓ యువకుడు అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు. అతను ప్రేమించిన యువతి మరో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా ఆమెతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. దీంతో అతను హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఈ సంఘటన జరిగింది.
మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన మనోజ్ కుటుంబం మదనపల్లి పట్టణంలోని బాలాజీనగర్‌లో స్థిరపడింది. మనోజ్ స్థానికంగా ఆటోడ్రైవర్ వృత్తిలో కొనసాగుతున్నాడు. పైగా తన వెంట చిన్నపాటి గ్యాంగ్‌ను తయారు చేసుకున్నాడు. ఈ క్రమంలో తాను నివసించే కాలనీలోని ఓ అమ్మాయిపై మనస్సుపడ్డారు. అమ్మాయి కూడా ఓకే చెప్పడంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు.
అయితే, ఈ విషయం తెలుసుకున్న ఇంట్లోని పెద్దలు మనోజ్‌కు తమ బిడ్డనిచ్చి వివాహం చేయడం ఇష్టంలేక, మరో యువకుడికిచ్చి పెళ్లి చేశారు. కానీ, మనోజ్ మాత్రం ఆమెను వదిలిపెట్టలేదు. వివాహమైనప్పటికీ కూడా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో గత బుధవారం నుంచి మనోజ్ అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు.

ఇంతలో బి.కొత్తకోట మండలం, కూలీతోపు దగ్గర మనోజ్ మృతదేహం కనిపించింది. అతని కాళ్లూ, చేతుల్ని వైర్లతో కట్టేసి, మందు తాగించి, బ్లేడ్‌తో గొంతు కోసి అత్యంత పాశవికంగా హత్యచేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ హత్యలో నలుగురైదుగురు పాల్గొనివుంటారని పోలీసులు భావిస్తున్నారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. మనోజ్ కుటుంబ సభ్యులు మాత్రం అమ్మాయి తరపువారే హత్య చేసివుంటారని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications