పోలీసుల థర్డ్ డిగ్రీలో కిడ్నీలు ఫెయిల్:సీఐ సస్పెన్షన్

హైదరాబాద్: చిత్తూరు జిల్లా పోలీసుల క్రూరత్వం మరోసారి బయటపడింది. అత్యాచారం కేసులో నిందితుడిగా భావిస్తున్న షేబ్ బాబును అరెస్టు చేసిన పోలీసులు అతడికి నరకం చూపారు. పది రోజుల పాటు అక్రమంగా నిర్భింధించిన పోలీసులు అతడికి థర్డ్ డిగ్రీ ఎలా ఉంటుందో రుచి చూపించారు.

దీంతో అతడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతడికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు, పోలీసుల థర్డ్ డిగ్రీ కారణంగా నిందితుడి కిడ్నీలు రెండు ఫెయిలయ్యాయని నిర్ధారించారు. ప్రస్తుతం తిరుపతిలోని స్విమ్స్‌లో అతడు చికిత్స పొందుతున్నాడు.

youth suffered kidney failure due to third degree torture

ఆసుపత్రిలో ఉన్న నిందితుడు తనను పోలీసులు ఏవిధంగా చిత్రహింసలకు గురిచేశారో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో నిందితుడి వాదన నిజమని తేలడంతో సీఐ వేణుగోపాల్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. పూర్తి విచారణ తర్వాత ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకంటామని ఎస్పీ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+