రాజమండ్రి మేయర్ గా యూట్యూబర్ కు కాంగ్రెస్ ఛాన్స్- ఎవరీ అన్విత ?

తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రి మున్సిపల్ కార్పోరేషన్ కు ఈ నెల 26న ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ప్రధాన పార్టీలు తమ మేయర్ అభ్యర్ధుల్ని ప్రకటించాయి. అధికార కూటమి తరపున మాజీ కార్పోరేటర్ రేలంగ్ శ్రీదేవిని బీజేపీ నిలబెట్టింది. అలాగే వైఎస్సార్సీపీ మాజీ సైనికుడు దాసి వెంకట్రావుకు ఛాన్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వీరిద్దరికీ భిన్నంగా ఓ మహిళా యూట్యూబర్ ను రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే రాజమండ్రిలో యూట్యూబ్ వీడియోలతో నిరూపించుకున్న బుడితి అన్వితను (YouTuber Anvitha) కాంగ్రెస్ తమ అభ్యర్ధిగా ఎంపిక చేసింది.

జనసేన బిగ్ ట్విస్ట్- కాకినాడ సహా ఐదు చోట్ల అభ్యర్ధుల ప్రకటన..!
జనసేన బిగ్ ట్విస్ట్- కాకినాడ సహా ఐదు చోట్ల అభ్యర్ధుల ప్రకటన..!

రాజమండ్రి మేయర్ స్ధానానికి కాంగ్రెస్ ఎంపిక చేసిన అభ్యర్ధి బుడితి అన్విత ఇప్పటికే యూట్యూబర్ గా నిరూపించుకున్నారు. అన్విత వ్లాగ్స్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న ఆమె.. ఫుడ్, లైఫ్ స్టైల్, ట్రావెల్, తెలుగు ఎంటర్ టైన్ మెంట్ వీడియోలు చేస్తుంటారు. అన్విత ఇప్పటికే రాజమండ్రిలో ప్రకృతి వేదిక పేరుతో మధ్యతరగతి ప్రేక్షకుల కోసం ఓ సినీ థియేటర్ ను కూడా నడుపుతున్నారు. తన యూట్యూబ్ ఛానల్లో దీనికి సంబంధించి కూడా చాలా వీడియోలు చేస్తుంటారు. దీంతో యూట్యూబర్ గా జనానికి తెలిసిన ఆమె ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

YouTuber Anvitha Enters Electoral Fray as Congress Candidate for Rajamahendravaram Mayor
జగన్ ఫ్యామిలీపై జనసైనికుల రోత వ్యాఖ్యలు- ఏపీ మహిళా కమిషన్ ఫైర్..!
జగన్ ఫ్యామిలీపై జనసైనికుల రోత వ్యాఖ్యలు- ఏపీ మహిళా కమిషన్ ఫైర్..!

అయితే కాంగ్రెస్ పార్టీ కేవలం యూట్యూబర్ గా ఉన్న అన్వితను ఎందుకు ఎంచుకుందంటే ఆమె.. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కోడలు. హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్ సతీమణి అయిన అన్విత ఇప్పటివరకూ కుటుంబ వ్యాపారాలతో పాటు యూట్యూబర్ గానే అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు రాజమండ్రి మేయర్ ఎన్నికలతో తొలిసారి రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు. తన మామగారు జీవీ హర్షకుమార్ తో పాటు కుటుంబ సభ్యలు ఇప్పటికే రాజకీయాల్లో ఉండటం, రాజమండ్రిలో స్థానికంగా తనకు పూర్తి అవగాహన ఉండటం వంటి అంశాలే ప్రాతిపదికగా కాంగ్రెస్ పార్టీ అన్వితను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, వైఎస్సార్సీపీ అభ్యర్ధుల్ని ఎదుర్కొని రాజమండ్రి మేయర్ గా అన్విత ఎన్నికవ్వాలంటే స్థానికంగా చాలా అంశాలు కలిసి రావాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+