అవినాశ్ వర్సస్ సీబీఐ - కర్నూలు, సుప్రీంలో కీలక పరిణామాలు ..!!

వైఎస్ అవినాశ్ వర్సస్ సీబీఐ అన్నట్లుగా పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఎంపీ అవినాశ్ తన తల్లి చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోనే ఉన్నారు. సీబీఐ అధికారులు జిల్లా ఎస్పీని కలిసారు. అవినాశ్ ను సీబీఐ అదుపులోకి తీసుకుంటుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అవినాశ్ అభిమానులు కర్నూలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అవినాశ్ తల్లి ఆరోగ్యం పైన వైద్యులు బులిటెన్ విడుదల చేసారు. ఇదే సమయంలో సీబీఐ అదనపు ఎస్పీకి ఎంపీ అవినాశ్ లేఖ రాసారు. ఇదే సమయంలో సుప్రీంలో మరసారి ఎంపీ బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు.

సీబీఐ అధికారుల మకాం : సీబీఐ అధికారులు ఈ తెల్లవారుజామున కర్నూలు చేరుకున్నారు. పోలీసు గెస్ట్ హౌస్ లో బస చేసారు. సీబీఐ విచారణకు రావాలంటూ అవినాశ్ కు రెండు సార్లు నోటీసులు పంపింది. కానీ, అవినాశ్ హాజరు కాలేదు. ఈ రోజు మరోసారి విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. తన తల్లి అనారోగ్యం కారణంగా తనకు పది రోజుల సమయం కావాలని అవినాశ్ కోరారు. దీంతో నేరుగా సీబీఐ అధికారులు కర్నూలు చేరుకున్నారు. ఎంపీ అవినాశ్ తల్లి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసారు. అటు సీబీఐ అధికారులు జిల్లా ఎస్పీతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అవినాశ్ తల్లితో పాటుగా ఆస్పత్రిలోనే ఉండటంతో కాసేపట్లో సీబీఐ ముఖ్య అధికారులు అక్కడకు చేరుకోనున్నారు.

 avinashcbisuprem-

సీబీఐకి అవినాశ్ లేఖ : సీబీఐ అటు కర్నూలు జిల్లా ఎస్పీతో మంతనాలు సాగిస్తున్న వేళ ఇటు ఎంపీ అవినాశ్ సీబీఐ అదనపు ఎస్పీకి లేఖ రాసారు. తనకు 15,16,19 తేదీల్లో 160 సి ఆర్ పి సి సెక్షన్ కింద హాజరు కావాలని నోటీస్ ఇచ్చిన విషయాన్ని అందులో పేర్కొన్నారు. తన తల్లి అనారోగ్యం తో కర్నూల్ లోని విశ్వ భారతి హాస్పిటల్ లో చేరారని వివరించారు. తన తల్లి అనారోగ్యం కు సంబందించిన మెడికల్ రిపోర్ట్స్ ను పొందపరుస్తున్నట్లు అందులో వెల్లడించారు. వైద్యుల సమక్షంలోనే తన తల్లి ఉండాలని వైద్యులు సూచించారని పేర్కొన్నారు. తన తండ్రి ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్ లో ఉన్నారని గుర్తు చేసారు. తన తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత తన పై ఉందని స్పష్టం చేసారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితుల కారణంగా కొడుకు గా తానే చూసుకోవాల్సి ఉందని సీబీఐకి వివరించారు.

సుప్రీంలో బెయిల్ పిటీషన్ : సీబీఐ ముందు విచారణకు హాజరయ్యేందుకు ఏడు రోజుల సమయం ఇవ్వాలని అవినాశ్ కోరారు. అవినాశ్ లేఖ పైన సీబీఐ నుంచి ఇప్పటి వరకు స్పందన లేదు. ఇదే సమయంలో సుప్రీంకోర్టులో మరోసారి అవినాశ్ రెడ్డి న్యాయవాదులు మరోసారి బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటీషన్ విచారించేలా ఆదేశాలివ్వాలని గత వారం సుప్రీంకోర్టులో అవినాశ్ తరపు న్యాయవాదులు సుప్రీంను ఆశ్రయించారు. దీని పైన నిర్ణయం వెలువడలేదు. ఇప్పుడు సీబీఐ అధికారులు కర్నూలులో మకాం వేసిన సమయంలో అవినాశ్ ఇప్పుడు సుప్రీంకోర్టులో మరోసారి బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. దీంతో, అటు కర్నూలులో సీబీఐ..ఇటు బెయిల్ పిటీషన్ పై సుప్రీం ఏ నిర్ణయం తీసుకుంటాయనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+