5 కోట్ల మంది ప్రజల కోసం...వైసిపి ఎంపీలు త్యాగం చేశారు:వైఎస్ జగన్
గుంటూరు: ఐదు కోట్ల మంది ప్రజల కోసం వైసిపి పార్టీ ఎంపీలు తమ పదవులు త్యాగం చేశారని, ఇలా లోక్‌సభ సభ్యుల రాజీనామా దేశ చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చన్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ శుక్రవారం సంగం జాగర్లమూడిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అంతేకాకుండా వైసిపి ఎంపీలు రాజీనామా చేసిన వెంటనే నిరాహారదీక్షకు కూర్చున్నారని జగన్ తెలిపారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నామని జగన్ గుర్తు చేశారు. అయితే తమతో పాటు టిడిపి ఎంపీలు కూడా రాజీనామా చేస్తే ఎపికి ఖచ్చితంగా మేలు జరిగేదని...25 మంది ఎంపీలు ఒకేతాటి పైకి వచ్చి రాజీనామాలు చేస్తే దేశం మొత్తం చర్చనీయాంశమైయ్యేదని జగన్ చెప్పారు. అప్పుడు కేంద్రం ఎపికి తప్పకుండా ప్రత్యేక హోదా ఇవ్వాల్సి వచ్చి ఉండేదని జగన్ అన్నారు.













Click it and Unblock the Notifications