హోదాపై జగన్ డెడ్‌లైన్, 15న నిరాహార దీక్ష: మండిపడిన రోజా

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా పైన ఈ నెల 15వ తేదీ లోపు ప్రకటన రాకుంటే తాను నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసిపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు.

జగన్ మంగళవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా పైన కేంద్రంపై అందరం కలిసి కట్టుగా ఒత్తిడి తేవాలన్నారు. అప్పటికీ కేంద్రం నుంచి ప్రకటన రాకుంటే సెప్టెంబర్ 15వ తేదీన గుంటూరులో నిరవధిక దీక్ష చేస్తానని చెప్పారు.

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నుంచి తన మంత్రులను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉపసంహరించుకుంటే కేంద్రంలో కదలిక వస్తుందన్నారు. కేంద్రం పైన ఒత్తిడిని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పారు.

 YS Jagan announces indefinite strike over Spl status to AP

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నాలు చేశామని చెప్పారు. దీనిపై చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. చంద్రబాబుపై మేం ఒత్తిడి తీసుకు వస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో టిడిపి తీరును తాము ఎండగట్టామన్నారు. బిజెపి సభ్యులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారన్నారు.

ఓటుకు నోటు కేసులో బయటపడేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. హోదా కోసం చంద్రబాబు గట్టిగా అడగకపోవడం వల్లనే కేంద్రం తేలిగ్గా తీసుకుందన్నారు. సభలో బిజెపి, టిడిపి నేతలు పరస్పరం ప్రశంసించుకోవడానికే సరిపోయిందన్నారు.

ప్రత్యేక హోదా పైన టిడిపికి చిత్తశుద్ధి లేదని ఇవాల్టి సభలో వారి తీరును బట్టి అర్థమైందన్నారు. కేంద్ర కెబినెట్ నుంచి వారు మంత్రులను ఉపసంహరించుకుంటేనే కేంద్రం తగ్గుతుందన్నారు. హోదా రాకుంటే నష్టపోయేది ఏపీ ప్రజలే అన్నారు. హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న వారి పేర్లు వెల్లడించలేదని ఆరోపించారు.

ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. సభలో అధికార పార్టీ వ్యవహరించిన తీరును అందరూ చేశారన్నారు. ప్రత్యేక హోదా కోసం తాము పోరాడుతామని చెప్పారు. ప్రజా సమస్యల పైన నిత్యం చంద్రబాబు దీక్షలు చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు అధికార పార్టీ పైన మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+