Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ సంచలనం: 2019 పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీదేవి, కేఈ కంచుకోటపై కన్ను

కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా సంచలన ప్రకటన చేశారు. 2019ఎన్నికల తొలి అభ్యర్థిని ఆయన ఇప్పుడే ప్రకటించారు. పత్తికొండ నియోజకవర్గం నుంచి దివంగత నేత నారాయణ రెడ్డి భార్య శ్రీదేవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

మీ చేతుల్లోనే శ్రీదేవి భవిష్యత్

మీ చేతుల్లోనే శ్రీదేవి భవిష్యత్

ఇక నుంచి శ్రీదేవి భవిష్యత్‌ను మీ చేతుల్లో పెడుతున్నానని ప్రజలతో జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆమెను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే జగన్ ఈ మేరకు ప్రకటించినట్లు తెలుస్తోంది.

కేఈ కోటపై కన్నేశారు

కేఈ కోటపై కన్నేశారు

అంతేగాక, మంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆయన సోదరుడు ప్రభాకర్‌లకు కంచుకోటగా ఉన్న నియోజకవర్గంపై వైసీపీ జెండా ఎగరేయాలనే లక్ష్యంతోనే జగన్.. ముందుగానే తమ అభ్యర్థిగా శ్రీదేవిని ప్రకటించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో శ్రీదేవి భర్త కాంగ్రెస్ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. కానీ, ఏడాది క్రితం ఆయనను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలోనే నారాయణ కుటుంబంలో ధైర్యం నింపేందుకు శ్రీదేవిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలుస్తోంది.

బాబు పాలనపై నిప్పులు

బాబు పాలనపై నిప్పులు

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి శనివారం కృష్ణగిరి గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం వల్ల తమకు ఏమాత్రం మేలు జరగలేదని, ఒక్క మంచి పని కూడా చంద్రబాబు చేయలేదని, రైతులకు గిట్టుబాటు ధర కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులను అమ్మేశాడు

రైతులను అమ్మేశాడు

చంద్రబాబు పాలన దారుణంగా ఉందని, కంది, మినుము, వేరుశనగ, మిర్చి, పత్తి.. ఇలా ఒక్క పంటకూ గిట్టుబాటు కల్పించడం లేదని మండిపడ్డారు. రైతుల కోసం రూ. వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. సీఎం అయ్యాక రైతులనే దళారులకు అమ్మేశాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు కూడా ఒక దళారి కావడం వల్లే రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని, బాబుకు చెందిన హెరిటేజ్‌ సంస్థ రైతుల నుంచి తక్కువ ధర కొనుగోలుచేసి.. ఆ తర్వాత ఎక్కువ ధరకు అమ్మకుంటున్నారని అన్నారు. మిగతా దళారులు సైతం రైతుల నుంచి తక్కువ ధరకు కొని.. ఆ తర్వాత అమాంతం ధర పెంచుతున్నారని వివరించారు.

చంద్రబాబు అవసరమా?

చంద్రబాబు అవసరమా?

‘నాలుగేళ్ల తన పాలనలో చంద్రబాబు ప్రజలను అన్నివిధాలుగా మోసంచేస్తున్నాడు

ఇవాళ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారని చెప్పగలరా? లేదు
నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్కరు కూడా సంతోషంగా లేరు
దారిపొడవునా అవ్వాతాతలు, వికలాంగులు నన్ను కలిసి.. పెన్షన్‌ రావడం లేదు' అని జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జన్మభూమి కమిటీ పేరిట చంద్రబాబు మాఫియాను నడుపుతున్నారని అన్నారు. పెన్షన్‌, రేషన్‌, ఇల్లు ఇలా ఏది కావాలన్నా లంచాలు ఇస్తేనే పని జరుగుతోందన్నారు. చంద్రబాబు లాంటి నాయకుడు వద్దే వద్దని ఈ సందర్భంగా జగన్ అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+