శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుకు సింగపూర్లో ఇళ్లు.. వెళ్లిపోతాడేమో, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి: జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టౌన్‌హాల్‌లో ప్రత్యేక హోదా పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువభేరీ జరిగింది. ఈ సదస్సులో వైసిపి అధ్యక్షులు జగన్ మాట్లాడారు. అనంతరం పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు యువనేత సమాధానం చెప్పారు.

యోగి (విద్యార్థి) - పులివెందుల పులిబిడ్డకు నమస్కారం. చంద్రబాబు అప్పులు చేసి సింగపూర్ వెళ్లిపోతారు. ఏపీని అప్పుల్లో ముంచుతారు.

జగన్ - యోగి ప్రశ్నపై జగన్ మాట్లాడుతూ.. నీకున్న అనుమానమే నాకు ఉంది. అప్పులు చేశాక చంద్రబాబు సింగపూర్ వెళ్లిపోతారు. ఈ మధ్యన ఎవరో నాకు చెప్పారు.. సింగపూర్లో చంద్రబాబు ఇల్లు కట్టుకున్నాడని. అందుకే రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదు.

హిమలక్ష్మి (విద్యార్థిని) - మా విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాయాలు లేవు. చంద్రబాబు స్మార్ట్ సిటీలు అంటున్నారు.. మాకు స్మార్ట్ సిటీలు వద్దు.. మౌలిక సదుపాయాలు కల్పిస్తే చాలు. చంద్రబాబు మాకు ఏం చేయరని అర్థమైంది. మీ మద్దతు మాకు కావాలి.

 YS Jagan answers to students in Srikakulam district

జగన్ - అందరం కలిసి కట్టుగా పోరాడుదాం.

దేవి (విద్యార్థిని) - అందరికీ రుణమాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పారు. మా అమ్మకు రుణమాఫీ కాలేదు.

జగన్ - మీ మాట విని అయినా చంద్రబాబుకు జ్ఞానోదయం అవుతుందనుకుంటున్నా. ఈ అంశం పైనా ధర్నాలు చేద్దాం.

సౌజన్య (విద్యార్థిని) - మేకిన్ ఇండియా, మేకిన్ ఆంధ్రా అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. మరి అమరావతి నిర్మాణం కోసం సింగపూర్ వాళ్లు కావాలా. ఇక్కడి వాళ్లు లేరా. డాక్టర్లను కూడా సింగపూర్ నుంచి తీసుకు వస్తారా?

జగన్ - నీ మాట విని చంద్రబాబుకు జ్ఞానోదయం కావాలి. మన దేశంలో పుట్టిన, మన రాష్ట్రంలో పుట్టిన ఇంజినీర్లు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టారు. చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు కూడా మన ఇంజినీర్లు డిజైన్ చేసింది. సింగపూర్ ఇంజినీర్లను తేవడానికి కారణం ఉంది. లంచాల అగ్రిమెంటులో భాగంగా ఆ భూములు సింగపూర్‌కు ఇస్తున్నారు. ఇచ్చినందుకు సింగపూర్ ఇంజినీర్లు వస్తున్నారు.

పవిత్ర (విద్యార్థిని) - చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇశ్తానని చెప్పారు. కానీ నెరవెర్చలేదు. ఆయనకు పాలించే నైతిక హక్కు లేదు.

జగన్ - చంద్రబాబుకు ఓటేసిన వారంతా ఇప్పుడు బాధపడుతున్నారు. ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. నేను దీని గురించి అడిగితే.. నేను ఆ మాట ఎప్పుడు అన్నానని అంటున్నారు. సిగ్గులేకుండా అలా మాట్లాడుతారు. ఇలాంటి వారికి నీవు చెప్పినట్లు పాలించే హక్కు లేదు.

సందీప్ (విద్యార్థి) - ప్రత్యేక హోదా కోసం మేం ఎలా పోరాడాలి, మీరు ఉద్యమిస్తే మేం ఎలా నడవాలి?

జగన్ - మనమంతా ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తేవాలి. మనం హోదా అంశాన్ని వదిలేస్తే దానిని ఎవరూ పట్టించుకోరు. కాబట్టి ఉద్యమించాలి. ఎవరు హోదా ఇస్తే వారినే ప్రధాని పదవిలో కూర్చోబెడదాం.

గురుమూర్తి (విద్యార్థి) - విశ్వవిద్యాలయంలో యువభేరీకి ఎందుకు అనుమతించరు?

జగన్ - చంద్రబాబు కొడుకు లోకేష్ పుట్టిన రోజుకు వీసీలు పోయి కేక్ కట్ చేయవచ్చు. కానీ విద్యార్థులు, ఏపీ ప్రయోజనాల కోసం మాత్రం సభను పెట్టుకోవద్దు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే రోజు వస్తుంది. బాబు మోసాలు చాలా చెప్పావు. ఆయన కులాల మధ్య చిచ్చుపెట్టేలా హామీ ఇచ్చారు. కానీ ఏదీ చేయలేదు. మీ ఉసురు తగులుతుంది.

మౌనిక (విద్యార్థిని) - శ్రీకాకుళం జిల్లాలో హిస్టారికల్ ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేస్తే ఉద్యోగాలు వస్తాయి. చాలామందికి ఉపాధి దొరుకుతుంది కదా.

జగన్ - చంద్రబాబు అభివృద్ధి చేస్తారని ఆశించవద్దు. ప్రత్యేక హోదా వస్తే చాలా అభివృద్ధి చెందుతుంది. దీనికి చంద్రబాబుపై ఆధారపడాల్సిన పని లేదు. బిజెపితో హోదా కోసం గట్టిగా పోరాడాలి.

అనిల్ (విద్యార్థి) - నేను అత్యంత అభిమానించే వారు సౌరవ్ గంగూలీ, జగన్. మీలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ రాజకీయ నాయకులు కావాలి.

జగన్ - థ్యాంక్స్.

సౌమ్య (విద్యార్థిని) - శ్రీకాకుళం జిల్లాకు విమానాశ్రయం తీసుకొస్తానని చంద్రబాబు అన్నారు. మొదట రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లు బాగా లేవు. వాటిని బాగు చేయాలి. వర్షం పడితే బస్టాప్ స్విమ్మింగ్ పూల్‌ను తలపిస్తుంది.

జగన్ - మన భూములు లాక్కునేందుకే విమానాశ్రయం. దానిని ప్రయివేటు వ్యక్తులకు ఇస్తారు. ఆ పక్కనే బాబు బినామీలు భూ ములు కొనుక్కుంటారు.

హరిత అనే యువతి ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన ప్రశ్నించగా.. మన ప్రభుత్వం వచ్చేసరికి ఏడాదా, రెండేళ్లా, మూడేళ్లా తనకు తెలియదని, కానీ ఫీజు రీయింబర్సుమెంట్సులో మాత్రం రెవెల్యూషన్ తీసుకు వస్తామని జగన్ చెప్పారు. ప్రతి ఇంట్లో నా తండ్రి వైయస్ ఫోటోతో పాటు నా ఫోటో పెట్టుకునేలా చేస్తానన్నారు.

English summary
YSRCP chief YS Jagan answers to students in Srikakulam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X