YS Jagan: రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల యుద్ధం హోరాహోరీగా కొనసాగుతుంది. గతానికి భిన్నంగా ఏపీలో కొనసాగుతున్న ఎన్నికల యుద్ధంలో ఇప్పుడు అందరూ ప్రధానంగా ఒక అంశం పైన చర్చించుకుంటున్నారు. జాతీయ రాజకీయ వర్గాలలో కూడా సీఎం జగన్ కు సంబంధించి ఒక అంశం కీలకంగా అందరిని ఆకట్టుకుంటుంది. అదే జగన్ ఎన్నికల ప్రచార వ్యూహం..

ఎన్నికల్లో అభ్యర్తులపైనే పార్టీల భవితవ్యం.. కానీ
సహజంగా ఎన్నికలు జరిగే సమయంలో ఆయా నియోజకవర్గాలలో గెలుపు కోసం పార్టీలు నిలబెట్టే అభ్యర్థుల పైనే ఆధారపడి ప్రధానంగా ఆయా పార్టీల భవితవ్యం ఉంటుంది. ఏ నియోజకవర్గానికి వెళ్లి ప్రచారం చేసినా అభ్యర్థి ఎలాంటివాడు? అభ్యర్థికి అవకాశం ఇస్తే ఏం చేయగలడు? వంటి అంశాలనే ప్రధానంగా తీసుకుని పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకులు కూడా మాట్లాడుతారు. మీ అభ్యర్థిని చూసి ఓటేయాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు.

YS Jagan AP CM YS Jagan set a new trend in politics

కొత్త ట్రెండ్ సెట్ చేసిన జగన్
కానీ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అందుకు భిన్నంగా కొత్త ట్రెండ్ ని సెట్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా, ఏ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేసినా అభ్యర్థికి సంబంధించిన విషయాలను చెప్పడం పైన ఆయన ఫోకస్ చేయడం లేదు. మీ బిడ్డ జగన్ అందించిన సంక్షేమం చూసి ఓటెయ్యండి అని అడుగుతున్నారు.

ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ప్రాధాన్యత లేదు
గత ఐదేళ్లుగా మీ బిడ్డ మీకు అందించిన అనేక పథకాలను చూసి ఓటెయ్యండి అని. మీ బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తూ, ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి అని ప్రచారం చేస్తున్నారు. ఎన్నిక ఎక్కడ జరిగిన అభ్యర్థి ప్రధానమైన వ్యక్తి. కానీ ప్రస్తుతం ఏపీలో వైసీపీలో మాత్రం అభ్యర్థికి ప్రాధాన్యత లేదు. ఐదేళ్లపాటు ప్రజలకు అందించిన సంక్షేమం మాత్రమే ప్రధానం. అందుకు కారణమైన జగన్ మాత్రమే ప్రధానం.

రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రచారంపై ఆసక్తి
సంక్షేమ మంత్రంతో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న జగన్ తన పైన నమ్మకంతో మళ్ళీ ఓటేయాలని కోరడం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఇక జగన్ పాలనలో కూడా ప్రజలు ఫలానా సమస్య అని చెప్పుకుని ఏ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి చాలా అరుదుగా కనిపించింది. ఎలాంటి సమస్య వచ్చినా, ముందుగా ప్రజలు వాలంటీర్ దృష్టికి తీసుకొచ్చి ఆపై తమ వార్డు లేదా గ్రామ సచివాలయాల్లో పరిష్కరించుకుంటున్నారు. దీంతో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే వరకు వెళ్లాల్సిన పరిస్థితి రాలేదు. అంటే వాలంటీర్ వ్యవస్థ ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు మధ్య అనుసంధానంగా నిలిచిందనే చెప్పాలి.

వన్ మ్యాన్ ఆర్మీగా జగన్

వన్ మాన్ ఆర్మీ గా జగన్ వైసిపి ని నడిపించడం రాజకీయాల్లో జగన్ సృష్టించిన కొత్త ట్రెండ్. జాతీయ పార్టీల నాయకులు సైతం ఈ విషయంలో జగన్ పైన చాలా ప్రత్యేక దృష్టి సారించారు. జగన్ చరిష్మానే ఏపీ ఎన్నికల్లో వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. జగన్ సృష్టించిన ఈ కొత్త ట్రెండ్ వైసీపీకి లాభం చేస్తుందా? లేదా ? అంటే కొన్నిరోజులు వేచిచూడక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+