Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వరదల వేళ జగన్ కీలక నియామకాలు - విజయవాడ కేంద్రంగా..!!

విజయవాడలో వరద పెను విషాదం మిగిల్చింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మోస్తరు వర్షం కొనసాగుతోంది. పలువురు ముంపు బాధితులకు అండగా నిలుస్తున్నారు. వైసీపీ కోటీ రూపాయల ఆర్దిక సాయం ప్రకటించింది. డిప్యూటీ సీఎం పవన్ తో సహా పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ వైఫల్యం
వరదలతో విజయవాడ అతలాకుతలం అయింది. బాధితులకు అండగా నిలిచేందుకు జగన్ పార్టీ నేతలతో సమీక్ష చేసారు. పార్టీ నుంచి కోటీ రూపాయాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే సమయంలో పార్టీ నుంచి నేతలతో టీంలు ఏర్పాటు చేసారు. అందులో భాగంగా బుధవారం ఉదయం లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్‌ బాటిళ్లు పంపిణీ చేస్తామని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఆ తర్వాత స్థానిక అవసరాలు గుర్తించి, పార్టీ నుంచి సాయం అందిస్తామని ఆయన తెలిపారు.

YS Jagan Appoints party presidents for districts key decision over Floods in vijayawada

సమీక్ష చేసారా
వరద అంచనా...సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని తమ మీదకు నెట్టేసే ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు..కార్యకర్తలు సహాయ చర్యల్లో పాల్గొనాలని సూచించారు. ఈ వరదలు మానవ తప్పిందంగా పేర్కొన్నారు. గతంలో వరదల సమయంలో ఎలా వ్యవహరించిందీ గుర్తు చేసారు. భారీ వర్షాలు, వరదలపై ముందే సమాచారం ఉన్నా, కనీసం సమీక్ష అయినా జరిపారా అంటూ నిలదీసారు. పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి వరద తగ్గించి, ఫ్లడ్‌ వాటర్‌ కుషన్‌ ఎందుకు ఏర్పాటు చేసుకోలేదని ప్రశ్నించారు.

పార్టీ నియామకాలు
ఇదే సమయంలో పార్టీ నియామకాలను ప్రకటించారు.అనంత‌పురం జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి, స‌త్యసాయి జిల్లా పార్టీ అధ్య‌క్షురాలుగా మాజీ మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌, తూర్పు గోదావ‌రి జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌ ను నియమించిన జగన్...రాజ‌మండ్రి న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుడిగా మాజీ ఎంపీ మార్గాని భ‌రత్‌ పేరు ఖరారు చేసారు. మరిన్ని నియామకాలను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+