ఎవరీ సాయి దత్, జగన్ కీలక బాధ్యతలు - ఢిల్లీ సిఫార్సు..!?
మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ ప్రక్షాళన మొదలు పెట్టారు. పార్టీలో కీలక నియామకాలు ప్రారంభించారు. జిల్లాల అధ్యక్షులతో పాటుగా అనుబంధ విభాగాల బాధ్యతలను మార్పు చేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర స్థాయిలోనూ పార్టీలో మార్పులు మొదలయ్యాయి. తాజాగా పార్టీ నిర్మాణంలో సలహాదారు అంటూ ఆళ్ల మోహన్ సాయి దత్‌ను నియమించారు. పార్టీలో ఈ నియామకం పై చర్చ మొదలైంది. ఎవరీయన. ఈ నియామకం వెనుక కారణం ఏంటి.
జగన్ నిర్ణయాలు
వైసీపీలో పార్టీ పరంగా పలు కీలక నియామకాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తున్నారు. పార్టీ పదవుల్లోనూ మార్పులు జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (లీగల్)గా పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని నియమించారు. కృష్ణా జిల్లా పెనుమలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వేణగోపాలకృష్ణమూర్తిని రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో పార్టీ నిర్మాణం కోసం సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్ ను నియమించారు.

కీలక నియామకాలు
దీంతో, ఎవరీ సాయి మోహన్ దత్ అనే కోణంలో పార్టీలో చర్చ మొదలైంది. పార్టీ కోసం 2017లో జగన్ పార్టీ శ్రేణులకు రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ తో పార్టీ ప్లీనరీలో పరిచయం చేసారు. 2024 ఎన్నికలకు రుషి రాజ్ సింగ్ ఐప్యాక్ టీం పని చేసింది. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. ఇక, ఇప్పుడు పొలిటికల్ కన్సెల్టెంట్ ఆళ్ల మోహన్ సాయి దత్ కు పార్టీ నిర్మాణ సలహాదారు హోదాలో నియామకం చేసారు. సాయి దత్ టీం 2024 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కోసం పని చేసింది.
తాజా నిర్ణయం
సాయి దత్ టీం బీజేపీ కేంద్ర నాయకత్వంలో ప్రధాన నేతకు ఫీడ్ బ్యాక్ కోసం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఆకస్మికంగా జగన్ సాయిదత్ ను ఎంపిక చేసుకోవటం వెనుక ఢిల్లీ నేతల సిఫార్సు ఉన్నట్లు పార్టీ లో చర్చ జరుగుతోంది. అయితే, ఏపీలో రాజకీయ పరిస్థితుల పైన ఇప్పటికే ఈయన జగన్ కు ఒక నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. 2024లో జగన్ ఓటమికి కారణాలు..పార్టీకి - జగన్ మధ్య ఏర్పడిన గ్యాప్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. దీంతో వీటిని సరిదిద్దుకొనే క్రమంలోనే కొత్త నిర్ణయాల దిశగా జగన్ నిర్ణయాలు చేస్తున్నట్లు..అందులో సాయిదత్ కు కీలక బాధ్యలు ఇచ్చినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications